కొంతమంది నటీనటులు ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చినా తెలుగు వాళ్లకి ఎంతో దగ్గరైపోతుంటారు. అలా దగ్గరైన నటులలో అరుంధతి నటి మనోరమ కూడా ఒకరు. అరుంధతి సినిమాలో మనోరమ ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. నిజానికి మనోరమ తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. తమిళనాట ముఖ్యమంత్రి కర్చీపై కూర్చున్న ముగ్గురు నటీనటులతోనూ మనోరమ సినిమాల్లో నటించారు.
Advertisement
తమిళ స్టార్ హీరో రజినీకాంత్ మనోరమ ను అమ్మా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు అంటే ఆమె తమిళ పరిశ్రమలో ఎంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో డబ్బింగ్ సినిమాల వల్ల మనోరమ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో అరుంధతి సినిమాలో కోడిరామకృష్ణ వద్దని చెప్పినా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పట్టుపట్టి మరీ మనోరమను తీసుకున్నారట.
Advertisement
ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఊహించినట్టుగానే మనోరమ పాత్ర సినిమాకు హైలెట్ గా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే అందరి జీవితాల్లో కష్టాలు ఉన్న విధంగానే సినిమా వాళ్ల జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయి. సినిమా అవకాశాలు తగ్గిపోతే ఆర్థికంగా….ఫ్యామిలీలో గొడవలు జరిగితే కుటుంబ పరంగా ఏదో ఒక రకంగా సమయం వచ్చినప్పుడు కష్టాలు తప్పవు.
అలా మనోరమ జీవితంతోనూ చివరిరోజుల్లో కష్టాలను అనుభవించారు. మనోరమ సొంత మనవరాలు ఆమెను కోర్టుకు ఈడ్చారు. ఆస్తుల కోసం కేసులు వేసి కోర్టుకు ఈడ్చారు. దాంతో చివరిరోజుల్లో మనోరమ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పండి. ఇక 2015లో వయసుమీద పడటం..అనారోగ్య కారణాలతో మనోరమ కన్నుమూశారు.