స్టార్ హీరోయిన్లు, అలాగే స్టార్ హీరోలు ఆఫర్ల కోసం ఎలాంటి రిస్కులు అయినా చేసేందుకు సిద్ధపడతారు. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో సెలబ్రిటీ లో చాలా ఫోకస్ చేస్తారు. డైరెక్టర్లు చెప్పిన విధంగానే బరువు తగ్గేందుకు, గ్లామర్ డోస్ పెంచిన ఎందుకు అనేక కసరత్తులు చేస్తారు. అయితే ఇలాంటి లిస్టులోకి కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్… కుష్బూ కూడా చేరిపోయారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా లో చాలా బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు చాలా స్లిమ్ గా కనిపిస్తోంది.
Advertisement
Advertisement
మరి అంత లావు నుంచి ఏకంగా 20 కిలోల ఆమె తగ్గి స్లిమ్ లుక్ లో కనిపించి.. అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు అంతలా ఒక్కసారిగా బరువు తగ్గడం పై… స్వయంగా నటి కుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో కంటే 20 కిలోలు తగ్గాలని.. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని అని ఆ పాత ఫోటో… అలాగే స్లిమ్ గా తయారైన కొత్త ఫోటోను షేర్ చేసి కుష్బూ ఈ వ్యాఖ్యలు చేసింది.
మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం గుర్తించుకోవాలని ఆరోగ్యమే మహా సంపద అంటూ.. హెల్త్ టిప్స్ చెప్పింది. గతంలో నేనెప్పుడు ఇంత ఫిట్ గా లేనని.. నేను మీ లో పది మందిని కూడా బరువు తగ్గించడానికి అలాగే ఫిట్ గా ఉంచడానికి ప్రేరేపించి నట్లయితే… నేను విజయం సాధించినట్లే అంటూ ఖుష్బూ పేర్కొన్నారు. అయితే కుష్బూ స్లిమ్ గా అయిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.