గత కొన్ని రోజులుగా బి-టౌన్ మొత్తం విక్కీ కౌశల్ అండ్ కత్రినా కైఫ్ పెళ్లి వార్తల సందడితో నిండిపోయింది. డిసెంబర్ 9న వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారని సమాచారం. ఇక ఈ వేడుకకు ఎవరెవరు హాజరవుతారనే దానిపైనే అందరి దృష్టి ఉంది. అయితే కత్రినా పెళ్ళికి నన్ను పిలవలేదంటూ ఓ స్టార్ హీరోయిన్ చెప్పడంపై అందరి దృష్టి పడింది. ప్రముఖ నటి, విక్కీ ‘లస్ట్ స్టోరీస్’ కో-స్టార్ కియారా అద్వానీ తనకు ఇంకా ఆహ్వానం రాలేదని పేర్కొంది. అంతేకాదు తాను వివాహానికి హాజరు కాలేనని సూచించింది.
Advertisement
Advertisement
ఓ మీడియా ఇంటరాక్షన్‌లో మీరు వివాహ కార్యక్రమానికి హాజరవుతున్నారా ? అని ఆమెను అడిగారు. కియారా వెంటనే “నిజంగానా? నేను (పెళ్లి గురించి) విన్నాను. కానీ నాకు తెలియదు. నాకు కూడా ఆహ్వానం అందలేదు” అని చెప్పుకొచ్చింది. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ కూడా తమకు ఆహ్వానం అందనందున వారి కుటుంబ సభ్యులు ఎవరూ క్యాట్ వివాహానికి హాజరు కావడం లేదని పేర్కొంది. విక్కీ, క్యాట్ వివాహానికి అతితక్కువ అతిథులను ఆహ్వానిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్, అలీ అబ్బాస్ జాఫర్, కబీర్ ఖాన్, రోహిత్ శెట్టి మరియు మరికొంత మంది ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న బార్వారాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో ఈ భారీ రేంజ్ లో ఈ పెళ్లి జరగనుంది. మరి ఈ పెళ్ళికి సల్మాన్ హాజరవుతున్నాడా ? లేదా ? అనేది కూడా సందేహంగానే ఉంది.