Home » అడ్డంగా దొరికిపోయిన బంగ్లా ఆటగాడు.. నిషేధం విధించిన ఐసీసీ..!

అడ్డంగా దొరికిపోయిన బంగ్లా ఆటగాడు.. నిషేధం విధించిన ఐసీసీ..!

by Azhar
Published: Last Updated on
Ad

క్రికెట్ అనేది ప్రపంచంలోనే ఎక్కువ జనాదరణ పొందిన క్రీడలో రెండవ స్థానంలో ఉంటుంది. ఈ క్రికెట్ ను చాలా దేశాల ప్రజలు ఆసక్తిగా చూస్తారు. మరి ముఖ్యంగా మన ఆసియా దేశాలలో అయితే ఈ క్రికెట్ ను మించిన ఆట మరొకటి లేదు. అయితే ఈ క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకు కారణం ఈ ఆటలో ఆటగాళ్ల యొక్క పద్ధతి. అయితే అప్పుడప్పుడు కొంతమంది ఆటగాళ్లు ఆ పద్దతిని వదిలేస్తారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్ మండలి అందుకు కొన్ని నియమాలు విధించి.. తాపీ చేసిన ఆటగాడికి శిక్ష అనేది విదిస్తుంది.

Advertisement

అయితే ఇప్పుడు ఓ బంగ్లాదేశ్ ఆటగాడు అలానే చేసాడు.  ఐసీసీకి అడ్డంగా దొరికిపోయాడు.  డ్ర gs  వాడడంతో  అతని పై నిషేధం అనేది విధించింది ఐసీసీ. అయితే బంగ్లాదేశ్ యువ పేసర్ షోహిదుల్ ఇస్లాం తన దేశం తరపున ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఇక ఈ మధ్యే బంగ్లాదేశ్ జట్టుతో చాలా దేశాలు పర్యటించినా కూడా అతనికి తుది జట్టులో మాత్రం చోటు అనేది లభించలేదు. ఇక తాజాగా ఈరోజు షోహిదుల్ ఇస్లాం యొక్క నమూనాలు అని తీసుకొని పరీక్షించగా.. అందులో నిషేధిత  క్లోమిఫెన్ యొక్క మోతాదు అనేది ఎక్కువగా లభ్యం అయ్యింది.

Advertisement

దాంతో వెంటనే ఐసీసీ షోహిదుల్ ఇస్లాంను విచారించగా.. అతను కూడా వాటిని తీసుకున్నట్లు అంగీకరించాడు. అందువల్ల ఐసీసీ నియమాలలోని డోపింగ్ నిరోదక కోడ్ ఆర్టికల్ 2.1 కోడ్ ను షోహిదుల్ ఇస్లాం అతిక్రమించడంతో అతడిని అంతర్జాతీయ క్రికెట్ నుండి 10 నెలలు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ బ్యాన్ అనేది వచ్చే ఏడాది మార్చ్ ఆఖరి వరకు అమలులో ఉంటుంది అని తెలుపుతూ.. ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి మద్దతుగా నిలిచిన గంగూలీ..!

వన్డే క్రికెట్ చనిపోతుంది అంటున్న అశ్విన్…!

Visitors Are Also Reading