నిత్యా మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో నటించిన చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో నిత్య మీనన్ బ్రైట్ ఫ్యూచర్ అనే బ్యానర్ పై సహ నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1970లో నాసా ప్రయోగించిన అంతరిక్ష నౌక ఎప్పుడు భూమ్మీద పడిపోతుంది అని కొన్ని దేశాలకు చెందిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ అంతరిక్ష నౌకకు స్కైలాబ్ అంటూ పేరు పెట్టుకున్నారు. అప్పట్లో ఇండియాలోనూ స్కైలాబ్ గురించి చాలాచోట్ల భయాలు నెలకొన్నాయి. దీని నేపథ్యంలోనే కథంతా సాగుతుంది.
Advertisement
Advertisement
కథ
ఆనంద్ అనే డాక్టర్ తన తాత గారి ఊరైన బండ లింగంపల్లికి వస్తాడు. అక్కడ సుబేదార్ రామారావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని క్లినిక్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంటాడు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబంలో నుంచి వచ్చిన రామారావు కష్టాలను గట్టెక్కడానికి ప్రయత్నిస్తుంటాడు. రామారావు, ఆనంద్ కలిసి క్లినిక్ ప్రారంభిస్తారు. కానీ అంతలోనే ఊర్లో స్కైలాబ్ పడుతుందనే భయం మొదలవుతుంది. మరోవైపు ఆ ఊరి దొరబిడ్డ గౌరీ జర్నలిస్టుగా ప్రయత్నం చేస్తూ, ఉద్యోగం లేక తండ్రి పెళ్లి చేస్తాడేమోనని భయపడుతూ ఉంటుంది. అయితే ఆమె రాసిన ఆర్టికల్స్ ఏవి ప్రచురణకు నోచుకోవు. స్కైలాబ్ భయం ఆ ఊరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? ఆనంద్, రామారావు, గౌరీ కష్టాలు ఎలా తీరాయి? అన్నది వెండి తెరపై వీక్షించాల్సిందే.
విభిన్న కథా నేపథ్యానికి కామెడీని జోడించి బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను అల్లుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సినిమా ఫస్టాఫ్ లో కామెడీ పెద్దగా పండలేదు. సెకండాఫ్ లో ఈ కీలకమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నటీనటుల పనితీరు, 1970 కాలాన్ని గుర్తు చేసే సెట్స్, వాతావరణాన్ని సృష్టించడం, సంగీతం, నిర్మాణ విలువలు బాగున్నాయి. సరికొత్త ప్రయత్నం చేసినందుకు చిత్రబృందాన్ని అభినందించాల్సిందే.