సాయి పల్లవి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గ్లామరస్ పాత్రలను చేయకుండా నాచురల్ గా,సింపుల్ గా,ఓ పల్లెటూరు అమ్మాయిలా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమా సినిమాకి విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఫిదా సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.
Advertisement
ఈమె నటించిన సినిమాలన్నీ ఎక్కువ శాతం భారీ విజయాన్ని అందుకున్నాయి.కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన విరాటపర్వం సినిమా మాత్రం సాయి పల్లవి అభిమానులను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు. అయితే తాజాగా సాయి పల్లవి, రానా ఇద్దరు కలిసి నెట్ ఫ్లిక్స్ లోని మై విలేజ్ షో కి హాజరయ్యారు. అయితే ఈ షో లో సాయి పల్లవి తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ఇందులో భాగంగా ఆమె ఏడో తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది.
Advertisement
సాయి పల్లవి మాట్లాడుతూ.. నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు నా స్కూల్ బ్యాగ్ లో ఒక అబ్బాయి లవ్ లెటర్ పెట్టాడు. అది గమనించని నేను రోజు వెళ్ళినట్టే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నా బ్యాగ్ లోని లవ్ లెటర్ ని చూసిన నా తల్లిదండ్రులు నన్ను చాలా కొట్టారు అంటూ తన ఏడో తరగతి లో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేసుకొని, అదే నా మొదటి ప్రేమలేఖ అంటూ చెప్పుకొచ్చింది. సాయి పల్లవి చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ;