Home » Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనక ఇంత కథ ఉందా.. ఆ ప్లాన్ వేసింది చిరు కోసమేనా..?

Chiranjeevi: అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనక ఇంత కథ ఉందా.. ఆ ప్లాన్ వేసింది చిరు కోసమేనా..?

by Sravanthi
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయం అంతా చిరంజీవి గురించి కావడంతో దీనిపై ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు. అయితే జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి విషయం అందరికి తెలిసిందే. అయితే అదే రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రోగ్రామ్ కు రాజకీయ నాయకుల తో పాటుగా ఇండస్ట్రీకి సంబంధించి కేవలం మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే ఆహ్వానం వచ్చిందట.. చిరంజీవి ని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి కారణాన్ని కూడా వివరించారు. అది ఏంటో చూద్దాం..?

Advertisement

గతంలోనే చిరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చేసిన విషయం అందరికి తెలిసిందే అయితే ఆయన పెద్ద హోదాలో చేశాడు కాబట్టి ఆహ్వానించారు అని అనుకోవడం ఒక ఎత్తైతే దాని వెనుక అసలైన కారణం వేరే ఉంది. అది ఏమిటో తాజాగా వెలుగులోకి వచ్చింది.. అయితే కార్యక్రమం అయిపోయిన తర్వాత రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు చోటు దక్కింది. అయితే విజయేంద్రప్రసాద్ కంటే ముందుగా చిరంజీవిని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తామని అడిగారని కానీ దానికి చిరంజీవి సున్నితంగా తిరస్కరించారని, దీంతో ఈ అవకాశం విజయేంద్రప్రసాద్ కు వచ్చిందని తెలుస్తోంది.

Advertisement

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగానే చిరంజీవితో ప్రస్తావించారని, కానీ చిరు సున్నితంగా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, మొత్తం సినిమాల్లో బిజీగా ఉన్నానని వారికి ఈ సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. అల్లూరి విగ్రహావిష్కరణ సభలో చిరు కు మంచి ప్రాధాన్యత కల్పించారు. కానీ చిరు ప్రధాని మోడీ ఇచ్చిన ఆఫర్ ను మాత్రం సున్నితంగా రిజెక్టు చేసారు. నాకు రాజకీయాలు పెద్దగా ఆసక్తి లేదని చిరంజీవి చెప్పడంతో బీజేపీ నేతలంతా సైలెంట్ అయిపోయారట. అయితే చిరంజీవికి ఆఫర్ ఇవ్వడం అంటే చాలా పెద్ద కథ ఉందని వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలని ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

also read:

 

Visitors Are Also Reading