న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ యూనిస్ పటేల్.. సంచలన రికార్డు సృష్టించాడు. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ లో తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు అజాజ్ పటేల్. స్పిన్ బౌలింగ్ ను చాలా కాన్ఫిడెంట్ గా… ఈజీగా ఆడే.. టీమిండియా బ్యాట్స్‌మెన్లను కూడా అజాజ్ పటేల్.. ముప్ప తిప్పలు పెట్టాడు. ఆజాజ్ ధాటికి టీమిండియా బ్యాట్స్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇండియా లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా.. 10 వికెట్లు తీశారు అజాజ్ పటేల్. గతంలో ఈ ఘనతను అందుకున్న వారిలో ఇండియన్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, జిల్ లేకర్ లు ఉన్నారు.
Advertisement
Advertisement
పాకిస్థాన్ తో జరిగిన టెస్ట్ లో కుంబ్లే 10 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా అనిల్ కుంబ్లే రికార్డును అజాజ్ పటేల్… బద్దలు కొట్టాడు. దీంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులకే అల్ అవుట్ అయింది. మయాంక్ 150 పరుగులు అక్షర్ పటేల్ 52 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. ఇక అజాజ్ పటేల్ 47.5 ఓవర్లలో 119 పరుగులు ఇచ్చి ఏకంగా 10 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుంది.