ఒకప్పుడు పిల్లల భాధ్యతలను తండ్రి ఉద్యోగం చేస్తే తల్లి చూసుకునేది. ఒకవేళ భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే అమ్మమ్మ లేదంటే నానమ్మలు చూసుకునేవారు. కానీ ఇప్పుడు చిన్నకుంటుబాలు ఏర్పడటం..పెరిగిన ధరలు టెక్నాలజీ దృష్ట్యా భార్య భర్తలు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లడం వల్ల పిల్లల భాధ్యతలను డే కేర్ సెంటర్ లు లేదా వారికోసం మనుషులను పెట్టి చూసుకుంటున్నారు.
Advertisement
అయితే తల్లి తండ్రలు తమ పిల్లలకు తగిన సమయం కేటాయించకపోవడం వల్ల అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లి తండ్రులు ఖచ్చితంగా తగిన సమయం పిల్లలతో కూడా గడపాలని సూచిస్తున్నారు. ఒక వేళ పిల్లలతో తల్లి దండ్రలు తగిన సమయం గడపకపోతే వారికి విలువలు తెలియకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.
Advertisement
పిల్లలు మానసికంగా కృంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా పెరిగి పెద్దవాళ్లు అయిన తరవాత వాళ్లు తల్లి దండ్రులను కూడా విడిచిపెడతారని వృద్ధాశ్రమంలో పెట్టే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. తమను ఎలా చూసుకున్నారో అదే విధంగా ట్రీట్ చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
అదే విధంగా తల్లి దండ్రుల ప్రేమ దొరకకపోవడంతో ప్రేమ కోసం వెతుకున్నే క్రమంలో తప్పుతోవలు పట్టే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అంతే కాకుండా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేని పరిస్థితిలో చెడు అలవాట్లకు బానిసలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి వారిని సరైన మార్గంలో పెట్టాలని చెబుతున్నారు.