తెలుగులో కొంతమంది సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ ను తెరిచిన పుస్తకంలా ఉంచుకుంటే మరి కొందరు మాత్రం తమ పర్సనల్ లైఫ్ ను మూసివేసిన పుస్తకం మాదిరిగా చాలా గోప్యంగా ఉంచుకుంటారు. తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఎలాంటి విషయాలు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అలాంటి సెలబ్రిటీలలో విజయశాంతి, రమ్యకృష్ణ ముందు వరుసలో ఉంటారు. అంతేకాకుండా వీరిద్దరి ఫ్యామిలీ లైఫ్ లో కొన్ని పోలికలు కూడా ఉన్నాయి.
Advertisement
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…. రమ్యకృష్ణ సినిమా జీవితం గురించి చాలామందికి తెలుసు…. కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా పుట్టారు. అయితే కొన్నేళ్లుగా రమ్యకృష్ణ మద్రాస్ లో ఉంటుండగా కృష్ణవంశీ మాత్రం హైదరాబాదులోనే ఉంటున్నారు.
Advertisement
ఇక వారి కుమారుడు చదువుల కోసం చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది. దాంతో అసలు రమ్యకృష్ణ కృష్ణవంశీలు కలిసి ఉంటున్నారా విడాకులు తీసుకున్నారా అనే విషయం ఎవరికి తెలియదు. ఇద్దరూ కలిసి పెద్దగా సినిమా ఫంక్షన్లలో కూడా కనిపించింది లేదు. వీరిద్దరి ఫోటోలు కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో వీరి వైవాహిక జీవితం ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకమే. అదేవిధంగా విజయశాంతి ప్రేమ పెళ్లి జీవితం గురించి కూడా చాలామందికి తెలియదు.
విజయ్ శాంతి శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి దిగిన ఓకే ఒక ఫోటో గూగుల్ లో కనిపిస్తుంది తప్ప మరొక ఫోటో కనిపించదు. అది కూడా పెళ్లినాటిది కావడం విశేషం. ఇక విజయశాంతి రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా విజయశాంతి శ్రీనివాస్ లకు సంతానం కూడా లేనట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరు కూడా కలిసి ఉంటున్నారా లేదంటే విడిపోయారా అన్నది కూడా ప్రేక్షకులకు అభిమానులకు ప్రశ్నార్థకమే.