మన దేశంలో ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. చాలా ఆచారాల వెనక సైన్స్ కూడా ఉంటుంది. అందువల్లే మన ఆచారాలను కట్టుబాట్లను ఇతర దేశీయులు సైతం గౌరవిస్తారు. కొన్ని మూడనమ్మకాలే కానీ కొన్ని పాటిస్తే మాత్రం ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో కొత్తగా పెళ్లైన భార్య భర్తలు కలుసుకోవద్దని చెబుతుంటారు.
Advertisement
దానికి కారణం ఆషాడంలో భార్య భర్తలు కలుసుకుంటే ఈ కాలంలో వైరస్ లు బాక్టీరియాలు ఎక్కువ ప్రభావవంతంగా ఉండటం వల్ల పుట్టుబోయే పిల్లల పై కూడా వాటి ప్రభావం పడుతుందని చెప్పడమే. అంతే కాకుండా ఆషాడం లో గర్భం దాలిస్తే పిల్లలు ఎర్రటి ఎండాకాలంలో పుట్టే అవకాశం ఉంది. అలా జరిగితే తల్లి బిడ్డా ఇద్దరూ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Advertisement
కాబట్టి సైన్స్ ప్రకారం గా కూడా భార్య భర్తలు ఈ సీజన్ లో కలవకూడదని చెబుతుంటారు. కానీ పెద్దలు చెప్పేది మాత్రం ఆషాడంలో అత్త కోడళు ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దని…ఇద్దరూ ఒకే గడప పై నుండి దాటవద్దని చెబుతుంటారు. మరోవైపు ఆషాడంలో చేతులకు గోరింటాకు కూడా పెట్టుకుంటారు. దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. ఆషాడమాసం లో వర్షాలు కురవడం వల్ల చేతులు కాళ్లు చెడటం మొదలవుతాయి.
అలా చేతులు పాదాలు పగుళ్లు వస్తే క్రిములు చేరి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రక్షణగా గోరింటాకును పెట్టుకుంటారు. ఇదిలా ఉంటే ఆషాడంలో కొత్తగా పెళ్లైనవాళ్లు మువ్వల పట్టీలు గొలుసులను తీసేస్తారు. అలా గొలుసులు తీసేయడానికి కారణం ఆషాడంలో గుట్టుగా కాపురం చేయాలని చెప్పడమేనని పెద్దలు చెబుతున్నారు. ఆషాడం తరవాత తిరిగి మళ్లీ మువ్వల పట్టీలను పెట్టుకోవచ్చని చెబుతున్నారు.