Home » ఆషాడంలో భార్యా భర్తలు ఎందుకు కలుసుకోకూడదు..దాని వెనక ఉన్న సైన్స్ ఇదే…!

ఆషాడంలో భార్యా భర్తలు ఎందుకు కలుసుకోకూడదు..దాని వెనక ఉన్న సైన్స్ ఇదే…!

by AJAY
Ad

భారతదేశం లో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి. ఇక్కడ అనేక మతాలు,కులాల వాళ్ళు ఉంటారు. మతం కులం వేరైనా అంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేది ఒక్క భారత్ లోనే. ఇక మన సంప్రదాయాల వెనక సైన్స్ కూడా ఉంటుంది. కొంతమంది అవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టి పారేస్తారు కానీ అసలు ఎందుకు ఆ సంప్రదాయం వచ్చింది…దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి అన్నది మాత్రం పట్టించుకోరు.

Advertisement

ఇక అలాంటి ఆచారాల్లో అషాడ మాసం లో కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఓకే చోట ఉండకూడదు అనే ఆచారం కూడా ఉంది. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం అత్త అల్లుడు…అత్త కోడలు ఓకే గడప పై నుండి దాటవద్దు అని చెపుతుంటారు. ఇక సైన్స్ విషయానికి వస్తే దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.

Advertisement

ఆషాఢమాసం లో వాతావరణం పూర్తిగా చల్లబడుతుంది అన్న సంగతి తెలిసిందే. వర్షాలు కురవడం తో వరదలు రావడం అంతే కాకుండా వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోతుంది. దాంతో వైరస్ , బ్యాక్టీరియాల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. అయితే ఇలాంటి సమయం లో గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ పై కూడా వాటి ప్రభావం ఉంటుంది.

పిండానికి మొదటి మూడు నెలలు చాలా కీలకం. అంతే కాకుండా ఆషాడం లో గర్భం వస్తే ఎర్రని ఎండాకాలం లో కాన్పు ఉంటుంది. అలాంటి సమయం లో డెలివరీ అయితే ఎండ తీవ్రత తట్టుకోలేరు. కాబట్టి ఆషాడం లో భార్య భర్తలు దూరంగా ఉండటమే మంచిది అని సైన్స్ కూడా చెబుతోంది.

Visitors Are Also Reading