Home » తెలంగాణలో థియేటర్లు బంద్.. మంత్రి తలసాని క్లారిటీ !

తెలంగాణలో థియేటర్లు బంద్.. మంత్రి తలసాని క్లారిటీ !

by Bunty
Ad

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు తలసాని తో భేటీ అయ్యారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం, షూటింగులు వంటి అంశాలపై తలసానితో ఈ సందర్భంగా చర్చించారు.

Advertisement

Advertisement

అనంతరం తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి కరోనా వల్ల సినీ పరిశ్రమ ఇబ్బందిగా మారిందని.. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో కొత్త రకం వైరస్ వస్తోందన్నారు. అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలతో పిలిచి మాట్లాడానని.. గతంలో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించామనీ తెలిపారు. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండన్నారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో థియేటర్లు మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అపోహలు నమ్మొద్దన్నారు.

ఏ వైరస్ వచ్చిన ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలకు, సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండంగా ఉంటుందని చెప్పారు. సినిమా చూస్తే థియేటర్లలోనే చూడండని.. వ్యాక్సిన్ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయని వివరించారు. సినీ పరిశ్రమ చాలా సున్నితమైనది, కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డాయని.. సినిమా టికెట్ల ధరల విషయం పెండింగ్ లో ఉందని వెల్లడించారు. హై కోర్టులో సినిమా టికెట్ల ధరల అంశానికి త్వరలోనే పుల్ స్టాప్ పెడతామనీ పేర్కొన్నారు.

Visitors Are Also Reading