Home » సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి… ఏపీ సర్కార్ నిర్ణయంపై సిద్ధార్థ్ ఫైర్..!

సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి… ఏపీ సర్కార్ నిర్ణయంపై సిద్ధార్థ్ ఫైర్..!

by AJAY
Ad

ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ టికెట్ రేట్లను కూడా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశంపై పలువురు సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా తాజాగా లవర్ బాయ్ సిద్ధార్థ్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ రేట్లు ప్రదర్శించాల్సిన షోలపై పరిమితులు విధించడం ఎంఆర్టిపి చట్టాన్ని ఉల్లంఘించడమే అని అన్నారు. దయచేసి సినిమా థియేటర్లను బ్రతికించే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. తాను మొదటి సారి 25 ఏళ్ల క్రితం స్టూడెంట్ కార్డు సహాయంతో విదేశాల్లో 8 డాలర్లు పెట్టి సినిమా చూసానని అప్పుడు అక్కడ సినిమా టికెట్ ధర $200 ఉందన్నారు.

Actor Siddarth

Actor Siddarth

ప్రస్తుతం మన సినిమాలు ఏ దేశ టెక్నాలజీకి కూడా తీసిపోవని తెలిపారు. ప్రభుత్వాలు ఆల్కహాల్, టొబాకో లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. ఈ దురాచారాన్ని ఆపాలంటూ సిద్ధార్థ వేడుకున్నారు. సినిమాల ద్వారా లక్షలాది మంది న్యాయబద్ధంగా జీవనోపాధి పొందుతున్నారని సిద్ధార్థ్ తెలిపారు. తమకు బిజినెస్ ఎలా చేయాలో ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే పన్నులు విధించుకోవాలని..అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ విధించాలని అన్నారు. కానీ అశాస్త్రీయంగా నిర్మాతలు, సిబ్బందికి జీవనోపాధి లేకుండా చోయిద్దని వేడుకున్నారు. సినిమాలు చూడాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని..చాలామంది పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారని సిద్ధార్థ్ గుర్తు చేశారు. ఒక ప్రాంతంలో ఉన్న ఇంటి అద్దె తలసరి ఆదాయం ఖర్చుల ఆధారంగా అయినా సినిమా టికెట్ రేట్లను నిర్ణయించాలని సిద్ధార్థ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రంగంలోనూ బిలియనీర్లు ఉన్నారని కేవలం సినిమా రంగాన్ని ఎందుకు టార్గెట్ చేశారని సిద్దార్థ్ ప్రశ్నించారు.

Advertisement

Advertisement

Actor Siddarth

సినిమా బడ్జెట్ స్థాయిని నిర్ణయించాల్సింది సినిమా నిర్మాత మాత్రమేనని… కానీ వినియోగదారులు కాదని అన్నారు. పేదరికం నుండి వచ్చి చనిపోయిన రాజకీయ నాయకులను ఏనాడైనా ప్రశ్నించారా అంటూ సిద్దార్థ్ నిలదీశారు. సినిమా పరిశ్రమను వేధించడం మానుకోవాలని కోరారు. రైతు గొప్పతనం తమకు తెలుసు అని చెప్పారు. రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. రైతులంత గొప్పవాళ్ళం కాకపోవచ్చునని కానీ తాము టాక్స్ కట్టే వారిమేనని… మనుషులమని గుర్తుంచుకోవాలన్నారు. ఒక సినిమా తీసేందుకు తాము ఎంతో కష్టపడి పని చేస్తామని అలాంటి చేతులను చంపే ప్రయత్నం మానుకోవాలని సిద్ధార్థ్ వేడుకున్నారు.

Visitors Are Also Reading