ప్రస్తుతం ఎంతో మంది మనోవిజ్ఞానశాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, జోతిష్యనిపుణులు అందుబాటులో ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు చాణక్యనీతిని ఫోలో అవుతారంటే ఆయన ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎలా ఉండాలి..ఎదగాలంటే ఏం చేయాలి ఇలా ప్రతిఒక్కటి తన చాణక్యనీతి ద్వారా ప్రతిఒక్కరికీ అర్థం అయ్యేలా చెప్పారు. ఇక చాణక్యుడు తన చాణక్యనీతిలో భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పారు.
Advertisement
అంతే కాకుండా చాణక్యుడు భర్త తన భార్య వద్ద ఐదు విషయాలను అస్సలు చెప్పకూడదని పేర్కొన్నాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…చాణక్యుడి నీతి ప్రకారం భర్త తనకు జరిగిన అవమానాలు భార్యతో అస్సలు షేర్ చేసుకోకూడదట. అలా చెప్పడం వల్ల భార్య భర్తపైనే తిరిగి అరవడం చేతకానివాడివా అంటూ మాట్లాడటం లాంటివి చేసే అవకాశం కూడా ఉందట. దాన ధర్మాలు చేసిన విషయం కూడా భార్యకు తెలియకూడదట.
Advertisement
భర్త తను చేసిన దాన ధర్మాలను గోప్యంగా ఉంచాలట. ఒకవేళ చెప్పుకుంటే విరాళం ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుందట. ఎలాంటి బలహీనతలు ఉన్నా కూడా అవి భార్యకు చెప్పకూడదట. భర్త తన బలహీనతలు షేర్ చేసుకుంటే ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగితే భార్య భర్త బలహీనత పై దాడి చేసే అవకాశం ఉందట.
కాబట్టి భార్యకు మాత్రమే కాదు తమ బలహీనతలను ఇతరులకు చెప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు తప్ప పరిష్కారాలు దొరకవట. భర్త తన ఆదాయాన్ని సైతం భార్యకు చెప్పకూడదట. భర్త సంపాదన తెలిస్తే భార్య హక్కులు పొంది భర్తల ఖర్చు వివరాలు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందట.