ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మానవ సంబంధాలు మంటకలిసి పోతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో కనిపించిన సంస్కృతి మనదేశంలోనూ ఇప్పుడు దర్శనం ఇస్తోంది. మనదేశంలో కుటుంబం అన్నా విలువలు అన్నా ఒకప్పుడు ఎంతో గౌరవించేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. బిజీ లైఫ్ లో పడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో భార్యా భర్తల మధ్యనే ఎక్కువగా గొడవలు వస్తున్నాయి. అంతే కాకుండా అక్రమసంబంధాలు కూడా పెరుగుతున్నాయి.
Advertisement
ప్రతి రోజూ వార్తల్లో అక్రమ సంబంధం వల్ల భర్త భార్యను చంపడం…లేదంటే భార్యలే భర్తను చంపడం లాంటి వార్తలు కనిపిస్తున్నాయి. అయితే భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఆమె ప్రవర్తనలో వచ్చే ఈ మార్పుల వల్ల కనిపెట్టవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. మరో వ్యక్తితో క్లోజ్ గా ఉంటున్న భార్య తన భర్త ఏ పనిచేసినా దాన్ని తప్పుపడుతుందట.
Advertisement
అంతే కాకుండా ప్రతిసారి అతడిపై కోప్పడుతూ కరెక్ట్ గా చేసిన పనిలో కూడా తప్పులు వెతికి తన పనితాను చేసుకుంటుందట. అంతే కాకుండా భర్తకు దూరంగా ఉండటం అబద్దాలు చెప్పడం లాంటివి కూడా చేస్తారట. కొంతకాలం సంబంధం అలాగే కొనసాగితే పిల్లలను సైతం పట్టించుకోవడం మానేస్తారట. అలాంటి సమయంలో భర్తకు తెలిసినా బయపడుకుండా తాము అనుకున్నదే చేస్తారట.
ఒకవేళ ప్రియుడు మోసం చేస్తే భర్త పిల్లలను కూడా పట్టించుకోకుండా డిప్రెషన్ లోకి వెళతారట. అలాంటి స్టేజ్ లో చనిపోయేందుకు కూడా వెనకాడరని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇతరులతో సంబంధాలు పెట్టుకున్న భార్యలు ఇంట్లోనే ఉన్నా వారి మనసు మాత్రం ఎక్కడో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇలాంటి సంబంధాలను ముందుగానే గుర్తించి అదుపులో పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని చెబుతున్నారు.
ALSO READ :మెగాస్టార్ చిరంజీవి కలలు కన్న హాలీవుడ్ సినిమా మధ్యలోనే ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?