సౌత్ ఇండస్ట్రీ నుండి అమితాబ్ బచ్చన్ కు ఎవరైనా పోటీ ఇచ్చారా అంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి కే దక్కిందని చెప్పాలి. అప్పట్లో అమితాబ్ బచ్చన్ సినిమాల కంటే చిరంజీవి సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. అంతేకాకుండా అమితాబచ్చన్ కంటే చిరంజీవి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకు రోజులు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లో మెగాస్టార్ తిరుగులేని హీరోగా ఎదిగారు. వరుస సూపర్ హిట్ లు అందుకున్నారు. ఇక అప్పట్లోనే చిరంజీవి కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు.
బాలీవుడ్ లో నటించిన చిరంజీవి కి హాలీవుడ్ లో నటించాలని కాదు కానీ హాలీవుడ్ రేంజ్ లో లో తెలుగు సినిమాలో నటించాలనే కోరిక ఉండేదట. కానీ ఆ కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. అయితే చిరంజీవి అప్పట్లోనే అలాంటి సినిమా కోసం ప్రయత్నించారు. ఆ సినిమానే అబూ బగ్దాద్ గజదొంగ. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు భారతీయులు చిరంజీవితో 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
Advertisement
Advertisement
ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపాలని అనుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ లో ఒక మతంవారిని కించపరిచినట్టుగా బయటకు లీక్ అయ్యిందట. దాంతో ఆ మతానికి చెందినవారు సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు.
అలా మెగాస్టార్ కలలు కన్నా కూడా హాలీవుడ్ ఎంట్రీ కల మధ్యలోనే ఆగిపోయింది. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, నందమూరి వా
రసుడు ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా….కన్నడ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
Also read : జాతకం బాగా లేదని ఆ హీరోయిన్ ని తన భర్త వదిలేశాడట..!