శోభితా ధూళిపాళ.. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన ఈమె పేరే బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.. మరి ఇంతకీ ఈ అమ్మడు ఏం చేసింది.. ఎందుకు ఈ విధంగా వైరల్ అవుతోంది అనే విషయానికి వస్తే, ఈ నటి హీరో అడివి శేష్ తో జత కట్టి “గూఢచారి”, తాజాగా వచ్చిన”మేజర్” మూవీ లో కూడా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె చేసినా కానీ ఆమె పాత్రలు అంతగా పాపులర్ కాలేదు. ఆమె సినిమాల్లో చేస్తే పేరు రాలేదు. మీడియాలో కూడా హైలెట్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల వల్ల ఆమె చాలా హైలెట్ అయ్యింది. అక్కినేని నాగ చైతన్య తో డేటింగ్ లో ఉందంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
దీంతో శోభితా ధూళిపాళ పేరు తెరపైకి వచ్చింది. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని త్వరలో వివాహం చేసుకొని ఒక్కటి కాబోతున్నారని ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనిపై సమంతా కూడా స్పందించింది. తాము తమ తమ పనుల్లో హ్యాపీగా ఉన్నాం, మీరు ఆపండి అంటూ ఇలాంటి రూమర్లు ఇచ్చే వాళ్లకు కౌంటర్ ఇచ్చింది సామ్. అయితే శోభితా మరియు చైతన్య ముంబై హోటల్ లో పదే పదే కలుస్తున్నారని ఒక వార్తా ఛానల్ కథనం ప్రచురించింది. దీని తర్వాత వార్తలు తెలుగు మీడియాలో కూడా అనేకం చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు నాగచైతన్య స్పందించలేదు.
Advertisement
కానీ శోభిత ధూళిపాల ఈ మధ్య కాలంలో తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె తన మిడిల్ ఫింగర్ ను చూపిస్తూ తనపై వస్తున్న తప్పుడు ప్రచారం పై చెక్ పెట్టింది.డేటింగ్ వార్తలపై వస్తున్న రూమర్స్ కి ఆమె కౌంటర్ ఇచ్చారనే చర్చ సాగుతోంది.. అయితే ఈ రూమర్ పై శోభితా మరియు సమంత స్పందించినా కానీ చైతూ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. నాగచైతన్య బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 12న థియేటర్లలోకి రాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ మీద విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యూ మూవీ కూడా జూన్ మూడో వారంలో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న చైతన్య విడాకుల ప్రభావం తనపై ఏ మాత్రం లేకుండా జాగ్రత్తగా కెరీర్ పై దృష్టి పెట్టారు.
also read;
జక్కన్న కాస్త సమయం ఇచ్చి ఉంటే.. ఉదయ్ కిరణ్ అలా అయ్యేవారు కాదేమో..?
Chanakya Niti : మీరు సంతోషకరమైన జీవితం పొందాలంటే.. చాణక్యుడి రహస్యాలను పాటించండి..!