టాలీవుడ్ లోకి మల్లేశం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామ అనన్య నాగల్ల. మొదటి సినిమాతోనే అనన్య కు ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో అనన్య అందం మరియు అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అమాయకమైన కల్లు మరియు ఆమె నటనతో మల్లేశం సినిమా విజయం లో కీలకంగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా లో అనన్య తన నటనకు ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం దక్కించుకున్నారు.
ఆ తర్వాత అనన్య అవకాశం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వాకీల్ సాబ్ సినిమా లో ఉండే ముగ్గురు ఈ అమ్మాయిల లో ఒక అమ్మాయి గా అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో అనన్య పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా అయినప్పటికీ ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.
Advertisement
Advertisement
ఆ తర్వాత ప్లేబ్యాక్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించడంతో పాటు అనన్యకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఇండస్ట్రీలో ఎదగాలంటే కొండంత శ్రమతో పాటు గోరంత అదృష్టం ఉండాలి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే అనన్య విషయంలోనూ కనిపిస్తూ ఉంటుంది. అందం టాలెంట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం అనన్య నాగళ్ల ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. ప్రతి రోజు ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అనన్య తాను యోగా చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోలో వివిధ భంగిమల్లో అనన్య యోగాసనాలు చేస్తోంది. కొన్ని ఆసనాలు ఆయితే చూస్తేనే అవి చేయడం చాలా కష్టం అని చెప్పొచ్చు. అలాంటి ఆసనాలను సైతం ఈజీగా వకీల్ సాబ్ భామ ఈజీగా చేసేస్తోంది. దాంతో అనన్య ఫిట్నెస్ సీక్రెట్ ఇదేమరి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.