Home » “చంటి నుండి F2” వరకు వెంకీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ ఏంటంటే..?

“చంటి నుండి F2” వరకు వెంకీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ ఏంటంటే..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే వెంకటేష్. ఆయనను బాలకృష్ణ వివేకానందుడితో పోల్చారు. అలాంటి వెంకటేష్ కెరియర్ లో చంటి మూవీ నుండి F2 వరకు ఏ సినిమాలు ఎంత కలెక్షన్ సాధించాయో ఓ సారి చూద్దాం..!
చంటి :వెంకటేష్ మీనా జంటగా నటించిన చంటి మూవీ రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా అప్పట్లో నే 9 కోట్ల రూపాయలు రాబట్టి రికార్డు సృష్టించింది.

Advertisement

నువ్వు నాకు నచ్చావు :వెంకటేష్ జంటగా ఆర్తి అగర్వాల్ నటించిన మూవీ నువ్వు నాకు నచ్చావు. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు కోట్లు అయితే కలెక్షన్స్ 12 కోట్ల రూపాయల బట్టి రికార్డు సృష్టించింది.

కూలీ నంబర్ 1:వెంకటేష్ హీరోగా టబు హీరోయిన్ గా నటించిన కూలి నెంబర్ వన్ మూవీకీ పెట్టిన బడ్జెట్ కంటే డబల్ ప్రాఫిట్ లభించింది.

క్షణక్షణం :శ్రీదేవి మరియు వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన క్షణ క్షణం మూవీ ఆర్జివి డైరెక్ట్ చేయగా ఈ మూవీ అనుకున్నంతగా లాభాలు అందించక పోయినప్పటికీ ఒక మంచి పేరు తెచ్చింది.

Advertisement

రాజా: వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ రాజా. ఈ మూవీ చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన అప్పట్లోనే ఏడు కోట్ల రూపాయలు రాబట్టింది.

సూర్యవంశం: వెంకటేష్ డబుల్ రోల్ లో చేసిన మూవీ సూర్యవంశం. ఇందులో హీరోయిన్ గా మీనా నటించిన ఇప్పించింది. ఈ మూవీ దాదాపుగా 12 కోట్లు రాబట్టింది రికార్డు సృష్టించింది.

కలిసుందాం రా : వెంకటేష్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా నటించిన మూవీ కలిసుందాం రా. ఈ మూవీ అప్పట్లోనే 14.5 కోట్లు రాబట్టి రికార్డులను క్రియేట్ చేసింది.

F2:ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎఫ్ 2. వెంకటేష్ హీరోగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా 35 బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ, బాక్సాఫీస్ వద్ద 127 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

also read;

37 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ పుస్త‌కాలు చేత‌బ‌ట్టి.. ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త

మీరు ఇంట్లో కూర్చోని మీ పీఎఫ్ ఖాతాను బ‌దిలీ చేసుకోవ‌చ్చు..ఎలాగంటే..?

Visitors Are Also Reading