హైదరాబాదులోని లాడ్ బజార్ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందిన హ్యాండ్ మేడ్ లాక్ బ్యాంగిల్స్ ఇప్పుడు జిఐ రిజిస్ట్రేషన్ లో పేరు సంపాదించుకున్నాయి. హస్తకళ వస్తువు పేరుతో జీఐ రిజిస్ట్రేషన్ దాఖలు చేయడంతో వీటికి మరింత ఆదరణ పెరగనుంది. అయితే హైదరాబాదు హలీంకు 2010లో మొదటిసారిగా ఇదే హోదా లభించింది. అయితే ప్రస్తుతం భౌగోళిక సూచిక (జిఐ )లో హైదరాబాద్ లోని లాక్ బ్యాంగిల్స్ కూడా అప్లికేషన్ ట్యాగ్ చేయబడ్డాయి. వీటికి ప్రత్యేక గుర్తింపుతో పాటుగా నెంబరింగ్ కూడా ఇవ్వబడింది.
Advertisement
సుభాజిత్ సాహ, జిఐ ఏజెంట్ రిజల్యూట్ గ్రూపులో భాగమైన టువంటి శ్రీహ రెడ్డి, పరిశ్రమ మరియు వాణిజ్య శాఖ నుండి, తెలంగాణ ప్రభుత్వ వాణిజ్యం ఎగుమతి ప్రోత్సాహక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుదీన్ పాల్ తో కలిసి ఈ ప్రాజెక్టులో పని చేస్తున్నారు. తాజాగా వీరు ఈ విషయాన్ని వెల్లడించారు. తరతరాల కాలం నుండి చక్కని డిజైన్ తో లాక్ బ్యాంగిల్స్ తయారు చేసే విధానం 500 సంవత్సరాల నాటిది. దేశం నలుమూలల ఈ లాక్ బ్యాంగిల్స్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ లాక్ బ్యాంగిల్స్ లు లక్క రెసిన్ నుండి తయారు చేస్తారు.
Advertisement
దీన్ని వేడిలో కరిగించి వృత్తాకారంలో తయారుచేసి, తర్వాత స్పటికాలు,పూసలు లేదా అద్దాలతో అలంకరిస్తారు. వీటినే చేతివృత్తుల నుండే ఎక్కువగా తయారుచేస్తారు. స్పటికాలు నుండి చెక్కిన నమూనాలు సంక్లిష్టత వల్ల బ్యాంగిల్స్ చాలా అందంగా కనబడతాయి. జిఐ రిజిస్ట్రేషన్ లో ఇవి చేరడంతో వీటి ఉత్పత్తి మార్కెటింగ్ కూడా పెరుగుతుందని, గాజుల డిమాండ్ కూడా పెరిగి అమ్మకాలు జరుగుతాయని వారంటున్నారు.
also read;
మీరు ఇంట్లో కూర్చోని మీ పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు..ఎలాగంటే..?
37 ఏళ్ల తరువాత మళ్లీ పుస్తకాలు చేతబట్టి.. ఆ పరీక్షలో ఉత్తీర్ణత