Home » మీ ఫోన్ కు ఉండే ఈ సన్నని రంధ్రం ఉపయోగం ఏంటో తెలుసా…?

మీ ఫోన్ కు ఉండే ఈ సన్నని రంధ్రం ఉపయోగం ఏంటో తెలుసా…?

by AJAY
Ad

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేతిలో కనిపించని వారంటూ ఉండరు. చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. ఇక కొందరు అయితే రెండు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే మనం అంతగా వాడుతున్న స్మార్ట్ ఫోన్ లో మనకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటాం. దాదాపు కనీసం పది గంటలు అయినా ఫోన్ మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇప్పటికీ మనకు ఫోన్ గురించి చాలా విషయాలు తెలియవు. కేవలం మనం ఉపయోగించే ఫీచర్ ల గురించి మాత్రమే తెలుసుకుంటాం. కానీ కొన్ని సదుపాయాలు ఫోన్ కు ఎందుకు ఇచ్చారు… వాటి వల్ల ఉపయోగం ఏంటి అన్నది మాత్రం ఆలోచించం. అయితే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ కు ఉండే ఒక సన్నని రంధ్రం ను చూసే ఉంటారు.

Advertisement

Microphone

Microphone

ఆ సన్నని రంధ్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లోకి విడుదలవుతున్న ప్రతి మొబైల్ ఫోన్ కు ఛార్జింగ్ పిన్ పక్కన ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో సూది దూరేటంత మాత్రమే సంధు కనిపిస్తుంది. ఆ రంధ్రం ను వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు. మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. కొన్నిసార్లు ట్రాఫిక్ లో ఉండవచ్చు… కొన్నిసార్లు సినిమా థియేటర్ లో ఉండవచ్చు.. మరికొన్నిసార్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండొచ్చు. అలాంటి సమయాల్లో పక్కన వాళ్ళు మాట్లాడటం, రోడ్లపై వాహనాల శబ్దం, సినిమా థియేటర్లో అయితే సినిమా సౌండ్ ఇలా రకరకాల శబ్దాలు వస్తుంటాయి.

Advertisement

అయితే ఆ శబ్దాలు మనతో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి కి వినిపించకుండా ఉండేందుకే ఈ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఉపయోగపడుతుంది. అందుకోసమే ఇది ఫోన్ స్పీకర్ దగ్గర అమర్చబడిన ఒక మైక్ గా ఉంటుంది. ఇది ఉండటం వల్లే మన పక్కన వచ్చే శబ్దాలు మనతో ఫోన్ మాట్లాడే వారికి వినిపించకుండా ఉంటాయి. ఇక ఈ రంధ్రం కొన్ని ఫోన్ లకు కెమెరా పక్కన… కొన్ని ఫోన్ లకు సైడ్ బటన్స్ దగ్గర మరికొన్ని ఫోన్లకు చార్జింగ్ పిన్ దగ్గర ఇస్తూ ఉంటారు.

ప్ర‌పంచంలోనే 5 ఖ‌రీదైన సిగ‌రెట్ బ్రాండ్లు.!

Visitors Are Also Reading