Home » ఓ దేశంలో పుట్టి మ‌రోదేశం త‌ర‌పున ఆడుతున్న క్రికెక‌టర్లు వీరే..!

ఓ దేశంలో పుట్టి మ‌రోదేశం త‌ర‌పున ఆడుతున్న క్రికెక‌టర్లు వీరే..!

by AJAY
Ad

పుట్టిన దేశం త‌ర‌పునే క్రికెట్ ఆడాల‌ని రూల్ ఏమీలేదు. కాబ‌ట్టి కొంత మంది క్రికెట‌ర్లు తాము పుట్టిన దేశాల త‌ర‌పున కాకుండా ఇత‌ర దేశాల త‌ర‌పున క్రికెట్ ఆడి స‌త్తా చాటుతున్నారు. అలా ఒక దేశంలో పుట్టి మ‌రో దేశం త‌రుపున క్రికెట్ ఆడుతున్న క్రికెట‌ర్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…..

chris jordan

chris jordan

#1) క్రిస్ జోర్దాన్
ఇంగ్లాండ్ కు చెందిన ఈ పేస్ బౌల‌ర్ 1988 వ సంవ‌త్స‌రంలో క‌రేబియ‌న్ దీవుల్లో జ‌న్మించాడు. కానీ జోర్దాన్ గ్రాండ్ పేరెంట్స్ ఇంగ్లీష్ సిటిజ‌న్లు కావ‌డంతో పై చ‌దువులు పూర్త‌య్యాక జోర్దాన్ కూడా ఇంగ్లాండ్ లో స్థిర‌ప‌డ్డాడు. దాంతో జోర్దాన్ వెస్టిండీస్ త‌ర‌పున కాకుండా ఇంగ్లాండ్ త‌ర‌పున ఆడుతున్నాడు.

Advertisement

sikhinder raja

sikhinder raja

#2) సికింద‌ర్ ర‌జా
జింబాంబే కు చెందిన ఈ స్టార్ ఆల్ రౌండ‌ర్ సికింద‌ర్ ర‌జా పాకీస్తాన్ లో జ‌న్మించాడు. త‌నకు యుక్త వ‌యసు వ‌చ్చే వ‌ర‌కూ పాక్ లోనే ఉన్నాడు. కానీ ఆ త‌వ‌రాత త‌న కుటుంబంతో క‌లిసి సికింద‌ర్ ర‌జా జింబాంబేకు వెళ్లాడు. అక్కడ దేశీవాలి క్రికెట్ లో స‌త్తాచాటి ఇప్పుడు జింబాంబే త‌ర‌పున ఆడుతున్నాడు.

usman khavaja

Usman khavaja

#3) ఉస్మాన్ క‌వ‌జా

Advertisement

ఆస్ట్రేలియాకు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పాకిస్థాన్ లో జ‌న్మించాడు. కానీ ఉస్మాన్ పేరెంట్స్ అత‌డికి ఐదేళ్లవ‌యసు ఉన్న‌ప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. దాంతో క్రికెట్ లో ప్ర‌తిభ క‌న‌భ‌రిచిన ఉస్మాన్ ఆస్ట్రేలియా త‌ర‌పున ఆడుతున్నాడు.

kevin peterson

Kevin Peterson

#4) కెవిన్ పీట‌ర్స‌న్
ఇంగ్లాండ్ కు చెందిన ఆట‌గాడు పీట‌ర్స‌న్ సౌత్ ఆఫ్రికాలో జ‌న్మించాడు. త‌న డొమెస్టిక్ క్రికెట్ మొత్తం సౌత్ ఆఫ్రికాలోనే ఆడాడు. కానీ త‌న తోటి ఆట‌గాళ్లతో విభేదాలు త‌లెత్త‌డం…సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డ్ తో కూడా విభేదాలు త‌లెత్త‌డంతో ఇంగ్లాండ్ కు చేరుకుని ఆ దేశం త‌ర‌పున ఆడి లెంజండ్ క్రికెట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ben stokes

ben stokes

#5)బెన్ స్ట్రోక్స్
క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న ఆట‌గాడు బెన్ స్ట్రోక్స్. ఆడేది ఇంగ్లాడ్ త‌ర‌పున కానీ అత‌డు జ‌న్మించింది న్యూజిలాండ్ లో కావ‌డం విశేషం. ప‌న్నెండేళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు బెన్ స్ట్రోక్స్ ఇంగ్లాండ్ కు చేరుకున్నాడు.

Also Read: ఇండియ‌న్ క్రికెటర్ సెంచ‌రీ చేస్తే BCCI బోన‌స్ గా ఎంతిస్తుందో తెలుసా?

Visitors Are Also Reading