మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలు వచ్చినా ఇతర పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయారు. చిరు టాలెంట్ ను గుర్తించిన దర్శకులు హీరోగా అవకాశాలు ఇవ్వడంతో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సక్సెస్ అయ్యారు. అయితే ఏ రంగంలో రానించాలన్నా ఎంతో కటోర శ్రమ పట్టుదల ఉండాలి. అంతే కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చిరు తన సక్సెస్ కోసం ఈ రెండింటిని పాటించాడు. సినిమా సక్సెస్ అయినప్పుడు పొంగిపోలేదు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కుంగిపోలేదు.
అంతే కాకుండా నిర్మాతలు దర్శకుల వద్ద అనుకువగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీలో అంతా మంచివారే ఉంటారనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ఆఫర్ ఇచ్చి ఆ ప్లేస్ లో వేరొకరిని తీసుకునేవాళ్లు ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో రెమ్యునరేషన్ లు కూడా ఎగ్గొట్టే నిర్మాతలు ఉంటారు. చిరు కెరీర్ లో కూడా ఇలాంటి ఎన్నో ఇబ్బందులను దాటుకుని వచ్చారన్న సంగతి అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. టాలీవుడ్ లో ఒకప్పటి బడా నిర్మాత చిరంజీవికి పారితోషికం ఎగ్గొట్టారట. ఆ నిర్మాత ఎవరు..? అసలేం జరిగింది అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం…ఎన్టీరామారావుతో సత్యచిత్ర నిర్మాణ సంస్థ అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించింది.
Advertisement
Advertisement
అయితే అదే బ్యానర్ నుండి మెగాస్టార్ కు ఫోన్ వచ్చిందట. బడా బ్యానర్ కావడంతో చిరు ఎంతో సంతోషంగా ఆఫీసుకు వెళ్లారు. ఆ బ్యానర్ నిర్మాత్లో ఒకరైన సూర్యనారాయణ చిరుతో మాట్లాడారు. సూపర్ స్టార్ కృష్ణతో కొత్త అల్లుడు అనే సినిమా చేస్తున్నామని అందులో విలన్ పాత్రలో నటించాలని చెప్పారు. అప్పటికే హీరోగా చేస్తుండటంతో మొదట చిరు నో చెప్పారట. కానీ సూర్యనారాయణ చిరును నానబెట్టి ఒప్పించారు.
అంతే కాకుండా నీతో హీరోగా సినిమా చేస్తామని చెప్పడంతో మెగాస్టార్ ఒప్పుకున్నారు. ఇక కొత్తఅల్లుడు సినిమా పూర్తై సూపర్ హిట్ అయ్యింది. తరవాత కృష్ణతో కొత్తపేట రౌడీ సినిమా చేస్తున్నామని అందులో కూడా గెస్ట్ రోల్ చేయాలని ఒప్పించారు. దాంతో అప్పటికే చిరును హీరోగా పెట్టి సినిమా చేస్తున్న నిర్మాతలు పెదవివిరిచారు. అయినా చిరుకు తప్పలేదు. అంతే కాకుండా కొత్తపేట రౌడీ సినిమా తరవాత కూడా చిరుతో సినిమా చేయకుండా నిర్మాత సూర్యనారాయణ దారుణంగా మోసం చేశారు.