ప్రముఖ సినీగేయరచయిత నిమోనియా తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యం క్షీణించడం తో ఆయన ఈరోజు కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి 20 మే, 1955లో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు.
ఆయన చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కె. విశ్వనాథ్ తెరకెక్కించిన సిరివెన్నెల సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సినిమా ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల సినిమాతో ఆయన అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. దర్శకుడు కె.విశ్వనాధ్ తో దాదాపు అన్ని సినిమాలకు సిరివెన్నెల పనిచేశారు. కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుచుకునేవారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు అవుతారు.
Advertisement
Advertisement
రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, కె.విశ్వనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకుండా సినిమాలే చేయలేదు. 2019లో సిరివెన్నెల కు పద్మశ్రీ వచ్చింది. కెరీర్ లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్.. అవార్డులను ఆయన అందుకున్నారు. ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలోనూ ఆయన పాటలు రాశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి కావడం చెప్పుకోదగ్గ విషయం. దాదాపు తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితోనూ కలిసి సిరివెన్నెల కలిసి పనిచేశారు.