తమ జీవిత భాగస్వామి జీవితంలో మరొకరికి చోటు ఉందని తెలియడం తట్టుకోలేని విషయం. అలాంటి పరిస్థితే ఇక్కడ ఓ భార్యకు ఎదురైంది. దాంతో ఆమె మానసిక నిపుణురాలి సలహాతీసుకుంది. ఇంతకీ ఆ భార్యకు వచ్చినకష్టం ఏంటి..? చవరకు మానసిక నిపుణులురాలు ఏమని సలహా ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం…నా పేరు మౌనిక ఏడాది క్రితమే పెద్దలు చూపించిన అబ్బాయితో నాకు వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు నా భర్త గురించి ఎలాంటి విషయాలు తెలియవు.
Advertisement
కానీ పెళ్లైన తరవాత ఇటీవల నా భర్త పెళ్లికి ముందే మరో మహిళను ప్రేమించినట్టు తెలిసింది. అంతే కాకుండా వాళ్లిద్దరూ ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. ఆమెతో విడిపోయిన తరవాతనే నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి నాకు మనశ్శాంతి లేదు. ఆ విషయం గురించి నా భర్తను అడగాలని అనుకుంటున్నా. నేను అనుకుంటుంది కరెక్టేనా నాకు ఏదైనా సలహా ఇవ్వగలరు.
Advertisement
మానసిక నిపుణురాలు మీ మనసులో ఉన్న ప్రశ్న మీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అడగండి కానీ మీరు ఎలా అడుగుతారు అన్నది ముఖ్యం. మీరు ఫలానా అమ్మాయిని ఇష్టపడ్డారట కద. ఎందుకు విడిపోయారు..అసలు ఏం జరిగింది. ఎందుకు పెళ్లి చేసుకోలేదు….అంటూ కూల్ గా అడగండి అప్పుడు మీ భర్త మీకు నిజాలు చెప్పే అవకాశం ఉంటుంది.
ఒకవేళ పెళ్లి తరవాత మిమ్మల్ని మీ భర్త ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటే టెన్షన్ పడకండి. మీకు ఇతరులు చెప్పి ఉంటే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా మీ భర్త ప్రవర్తన పై దృష్టి పెట్టండి. ప్రస్తుతం మిమ్మల్ని భాగా చూసుకుంటే గతం గతః అనుకుంటే మంచిది. అదే విషయాన్ని పట్టుకుంటే మీ కాపురంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.