ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ ను ముంతాజ్ ప్రేమకు గుర్తుగా తన భర్త షాజహాన్ నిర్మించిన సంగతి తెలిసిందే. తాజ్ మహల్ నిర్మాణానికి మొత్తం 20 వేల మంది కార్మికులు పని చేశారని చరిత్ర చెబుతోంది. అంతేకాకుండా తాజ్ మహల్ కట్టిన ఇరవై వేలమంది చేతులను షాజహాన్ నరికేశాడు అని చెప్పుకుంటారు. అయితే మరికొందరు మాత్రం షాజహాన్ కూలీల చేతులు నరికివేయలేదని కానీ వాళ్ళతో షాజహాన్ మళ్లీ తాజ్ మహల్ లాంటి నిర్మాణం ను కట్ట కూడదు అని ఒప్పందం చేసుకున్నట్టు చెబుతుంటారు.
అయితే ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది… కానీ ఆలోచిస్తే నిజానికి తాజ్ మహల్ ను షాజహాన్ తన ప్రేయసికి గుర్తుగా కట్టించాడు. ఎంతో ప్రేమగా రాజస్థాన్ నుండి పాలరాతిని తెప్పించుకుని మరీ తనకు నచ్చినట్టుగా అందంగా కట్టించాడు. కాబట్టి తాజ్ మహల్ పట్ల ఆయనకు ఎంత ప్రేమ… అభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి టాజ్ మహల్ ను తను ఎంతగానో ప్రేమించే తన ప్రేయసికి గుర్తుగా నిర్మించిన తాజ్ మహల్ ను కట్టిన కూలీల చేతులను నరికి వేయాల్సిన అవసరం ఏముంది..? షాజహాన్ తాజ్మహల్ ను ఎంతో ప్రేమతో కట్టించుకున్నాడు.
Advertisement
Advertisement
మరోవైపు షాజహాన్ తన వద్ద పనిచేసిన కూలీల చేతులను నరికివేశాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు గానీ నరికివేయలేదు అనడానికి కొన్ని సజీవ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణంలో పిట్టా దూరాను అమలు చేసిన అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు ఇంకా బ్రతికే ఉన్నారు. వారి పూర్వీకులు అయిన తాజ్ మహల్ కట్టిన కూలీల వద్దనే వారు ఆ కళను నేర్చుకుని ఉంటారని కొంతమంది ఇప్పటికీ చెప్పుకుంటారు.