చాలినన్ని సినిమాలు చేసిన తరవాత కొంతమంది హీరోయిన్లు ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకుని ఇతర దేశాలకు వెళ్లిపోతే మరికొందరు బడా వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతుంటారు. కానీ అతికొద్దిమంది హీరోయిన్ లు మాత్రమే పెళ్లికి దూరంగా ఉంటారు. అలా నలభై దాటినా పెళ్లికి దూరంగా చాలా మంది ఉన్నారు. వారిలో టాలీవుడ్ హాట్ హీరోయిన్ టబు కూడా ఒకరు. టబు ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలు ఇతర క్యారెక్టర్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
కానీ ఏజ్ పెరిగినా టబు మాత్రం ఇంకా పెళ్లికి దూరంగానే ఉంది. అందుకు కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.నాగార్జున హీరోగా తెరకెక్కిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు అవాక్కయ్యారు. వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందేమోనని అనుకున్నారు. అంతే కాకుండా టబు పెళ్లికి దూరంగా ఉండటానికి కూడా నాగార్జుననే కారణం అని కూడా గాసిప్స్ వచ్చాయి.
Advertisement
టబు హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా నాగార్జున ఇంట్లో భస చేయడం ఆయనతో క్లోజ్ గా ఉండటం కూడా ఆ రూమర్లకు కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే టబు మాత్రం రీసెంట్ ఇంటర్వ్యూలో తన పెళ్లి కాకపోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గన్ అంటూ బాంబు పేల్చింది. తమది ప్రత్యేకమైన అనుబంధం అని చెప్పింది.
అజయ్ దేవ్ గన్ తనను ఎక్కడకు వెళ్లినా ఫాలో అవుతుండేవాడని చెప్పింది. తనను ఏ అబ్బాయి చూసినా వారికి వెళ్లి వార్నింగ్ లు ఇచ్చేవాడని చెప్పింది. అజయ్ దేవ్ గన్ వళ్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పింది. అంతే కాకుండా తాను చిన్నపిల్లలా ప్రవర్తించినా కూడా అజయ్ దేవ్ గన్ తనను చాలా బాగా చూసుకునేవాడని తెలిపింది.