Home » అప్పట్లోనే కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణం వల్లే చనిపోయాడా…!

అప్పట్లోనే కోటి రెమ్యునరేషన్ అందుకున్న ఉదయ్ కిరణ్…ఆ ఒక్క కారణం వల్లే చనిపోయాడా…!

by AJAY
Ad

హీరో గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సంచలనాలు సృష్టించిన హీరోల్లో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. ఫస్ట్ సినిమా చిత్రంతోనే ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మనసంతా నువ్వే, నువ్వు నేను లాంటి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ లను అందుకున్నారు. ఉదయ్ కిరణ్ నటన… సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉండేది.

Advertisement

అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమా వచ్చిందంటే స్టార్ హీరోలకు సైతం థియేటర్ లు దొరకని రోజులు ఉన్నాయి. దాంతో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీని ఏలుతారని అంతా అనుకున్నారు. కానీ ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ తారా స్థాయికి చేరిందో అంతే తే వేగంతో కిందకు చేరుతుంది. దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే…. మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు.

Advertisement

చిరంజీవి పెద్ద కూతురు తో ఉదయ్ కిరణ్ కు పెళ్లి నిశ్చయమయింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వివాహం క్యాన్సల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో ఇబ్బందులు మొదలయ్యాయని…వచ్చిన ఆఫర్లను కూడా దర్శకులు నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇప్పటివరకు నిరూపించ బడలేదు. కాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు దిల్ రమేష్ ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్ చనిపోయే సమయానికి తాను అతనితో క్లోజ్ గా ఉన్నానని తెలిపారు.

udaykiran

udaykiran

పెద్ద హీరోలు అంటే చాలా రిసర్వ్ డ్ గా ఉంటారని మన కంటే తక్కువ వయస్సు ఉన్న హీరోలు అయితే ఫ్రెండ్లీ గా ఉంటారని తెలిపారు. ఉదయ్ కిరణ్ అప్పట్లోనే 75 లక్షల నుండి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న హిరో అని చెప్పారు. సక్సెస్ స్ట్రెస్ వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని రమేష్ వెల్లడించారు. దిల్ రమేష్ దిల్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Also read : ఆర్ఆర్ఆర్ సినిమాలో డిలీట్ చేసిన ఎన్టీఆర్ మూడు సీన్లు ఇవే…!

Visitors Are Also Reading