Home » చాహల్ మొదటి ప్రేమ గురించి భార్య ధనుశ్రీ కామెంట్స్..!

చాహల్ మొదటి ప్రేమ గురించి భార్య ధనుశ్రీ కామెంట్స్..!

by Azhar
Ad
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి అభిమానులకు బాగా తెలుసు. చాలా ఎక్కడ ఉంటె అక్కడ నవ్వుల్ కూడా ఉంటాయి. అయితే చాహల్ తన ఆటతో ఎంత గుర్తింపు తెచుకున్నాడో తన ఫన్నీ మూమెంట్స్ తో కూడా అలానే ఫెమస్ అయ్యాడు. ఇక కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరగని సమయంలో చాలా మంది ఆటగాళ్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో చాహల్ కూడా ఒక్కడు. చాహల్ కరోనా సమయలోనే తాను ఎన్నో రోజులుగా ప్రేమిస్తున్న ధనశ్రీని పెళ్లి చేసుకున్నాడు.
అయితే జంట సోషల్ మీడియాలో చాలా వైరల్ గానే ఉంటుంది ఎప్పుడు. ఇక తాజాగా ధనశ్రీ చాహల్ నవ్వు గురించి మాట్లాడుతూ.. అందుకు కారణం తన మొదటి ప్రేమ అని చెబుతుంది. చాహల్ నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. కానీ తన ఫస్ట్ లవ్ మతమే నేను కాదు. తన ఫస్ట్ లవ్ క్రికెట్. చాహల్ కు క్రికెట్ అంటే పిచ్చి, ప్రేమ. తాను నా కంటే ఎక్కువగా క్రికెట్ నే ప్రేమిస్తాడు అని ధనశ్రీ చెప్పింది. అలాగే తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతున్న సమయంలో ఎప్పుడు నవ్వు అతను మొఖం మీద ఉంటుంది అని అంది.
కానీ నేను చాలా లాగా కాదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సమయంలోనైనా అతను నవ్వుతూనే ఉంటాడు. కానీ నేను అలా ఉండలేను. నేను కొంచెం భావోద్వేగపూరిత మనిషిని. మ్యాచ్ లో పరిస్థితికి తగ్గట్లు నేను ప్రవర్తిస్తా. వికెట్ తిస్తె బాగా అరుస్తా.. సిక్స్ పోతే డల్ అయిపోతా..! ఈ విషయం బహుశా ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను మ్యాచ్ చూసే సమయంలో ఓ అభిమానిగానే చూస్తా అని ధనశ్రీ పేర్కొంది.

Advertisement

Visitors Are Also Reading