టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగి చిన్నవయసులోనే మనకు దూరమైన గొప్ప నటులలో రియల్ స్టార్ శ్రీహరి ఒకరు. శ్రీహరి కరాటే, బాడీబిల్డింగ్ లో సత్తా చాటి ఆ తరవాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వందల సినిమాల్లో నటించి శ్రీహరి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా విలన్ గా పవర్ ఫుల్ పాత్రలలో నటించి మెప్పించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిషకు అన్నగా నటించి శ్రీహరి తన నటనతో ఫిదా చేశారు.
Advertisement
అంతే కాకుండా భద్రాచలం సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించింది. కుబుసం, బృందావనం,ఢీ ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీహరి కెరీర్ లో ఎన్నో బెస్ట్ చిత్రాలున్నాయి. శ్రీహరి డూప్ లేకుండానే యాక్షన్ సన్నివేశాల్లో నటించేవాడు. అందువల్లే ఆయనకు రియల్ హీరో అనే ట్యాగ్ వచ్చింది. ఇదిలా ఉంటే శ్రీహరి లేని లోటు టాలీవుడ్ లో తీర్చలేనిది. సినిమాల్లో కొన్ని పాత్రలు చూస్తుంటే ఈ పాత్ర శ్రీహరి చేసి ఉంటే ఎంతబాగుండేదో అనే ఫీలింగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు కలుగుతుంది.
Advertisement
కాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీహరి ఎలా చనిపోయారో చెబుతూ ఆయన భార్య డిస్కో శాంతి ఎమోషనల్ అయ్యారు. శ్రీహరి బరువు పెరగటంతో తగ్గేందుకు గానూ చికిత్స తీసుకున్నారట. దాని ప్రభావం కాలేయం పై పడటంతో కాలేయ సంబంధిత వ్యాధులతో ఆయన ఇబ్బందులు వచ్చాయట. బాలీవుడ్ లో ఆర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ కు వెళ్లి వచ్చిన శ్రీహరి రాత్రి టిఫిన్ చేసి పడుకున్నారట.
అయితే మధ్యలోనే రాత్రి 3గంటలకు లేచి కడుపు నొప్పి అంటూ ఏడ్చారట. దాంతో శ్రీహరిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్టు డిస్కోశాంతి తెలిపారు. ఆస్పత్రిలో శ్రీహరికి ఓ సెలైన్ పెట్టగా ఓ నర్సు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారని ఆ వెంటనే శ్రీహరి కడుపు అంటూ కేకలు వేశారని తెలిపారు. ఆ ఇంజక్షన్ వేసిన తరవాతనే శ్రీహరి ఆరోగ్యం క్షీణించిందని డిస్కో శాంతి ఎమోషనల్ అయ్యారు.
ALSO READ : ss రాజమౌళి విరాళాలు అస్సలు ఇవ్వరట ఎందకో తెలుసా ? ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ..!