పోతులూరి వీరబ్రహ్మాంద్రేస్వామి గారి కాలజ్ఞానానికి ఎంతో గుర్తింపు ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి. ఐదుకాళ్లతో లేగదూడ జన్మించడం..వెంపలి చెట్టుకు నిచ్చెన వేసే మనుషులు జన్మించడం..అంతే కాకుండా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కోరంకి అని జబ్బు ఒకటి వచ్చునని గిలగిలా కొట్టుకుంటూ మనుషులు చనిపోతారని ఉంది. అదే కరోనా అని పలువురు భావిస్తున్నారు.
Advertisement
బ్రహ్మంగారు ప్రళయాలు వస్తాయని చెప్పారు. అది కూడా జరిగిపోయింది. ఇంకా ముందు ముందు ఏం ఏం జరుగుతాయోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్న చాలా విషయాలు ఇప్పటికే జరిగిపోయాయి. అంతే కాకుండా ఎప్పుడూ రద్దిగా తెరుచుకుని ఉండే తిరుమల దేవస్థానం తలుపులు కూడా మాసివేయబడతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు.
Advertisement
అయితే అది కూడా గతంలో జరిగిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఒకసారి కాదు తిరుమల రెండు సార్లు మూత పడింది. ఎందుకు మూతపడింది ఎప్పుడు మూతపడింది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం…1981 అక్టోబర్ 8న ఉదయం 10 30 గంటల సమయంలో మొదటిసారి తిరుమల మూతపడింది. ఓ డ్యూటీ చేస్తున్న ఓ పోలీసులు అధికారి రూల్స్ కు విరుద్దంగా తన కుటుంబంతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణవాతావరణం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులను బయటకు నెట్టి ఆలయ సిబ్బంది గుడిముఖద్వారాన్ని మూసి 20నిమిషాల పాటూ ధర్నా చేశారు. అంతే కాకుండా 1982లో టీటీడీ ఆలయ ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ ప్రసాద్ రావుగారు తిరుమలను అందంగా తీర్చిదిద్దారు. ఆయన వల్లనే ఇప్పుడు తిరుమల అంత విశాలంగా ఉంది. అంతకముందు ఆ ప్రదేశం అంతా దుకాణాలతో కిక్కిరిసిపోయింది. అయితే ఆయన తీర్చిదిద్దే క్రమంలో దుకాణాదారులకు ఆయనకు మధ్య గొడవ జరిగింది. దుకాణాదారులంతా కలిసి ఆయనపై దాడి చేశారు. దుకాణాదారులు రాళ్లు విసరడంతో ఆలయ ముకద్వారాన్ని మూసివేసి దర్శనం నిలిపివేశారు.
ALSO READ :