మనదేశంలో పురుషులకు 21ఏళ్లు, స్త్రీలకు 18 ఏళ్లు నిండితే చట్టప్రకారంగా వివాహం చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు ఈ వయసు రాకముందే ఎక్కువగా బాల్య వివాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు చట్టాలు కఠినంగా మారడం….తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావడంతో చాలా వరకు బాల్యవివాహాలు తగ్గిపోయాయి. ఇక అబ్బాయిల పెళ్లి విషయానికి వస్తే జీవితంలో ఉద్యోగం సాధించి లేదా ఏదైనా వ్యాపారంలో స్థిరపడిన తరవాత వివాహం చేస్తున్నారు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి 18నిండిన వెంటనే చదువుకుంటున్నా కూడా సంబంధాలు చూస్తుంటారు.
Advertisement
ఎంత త్వరగా వీలైతే అంతత్వరగా పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వళ్ల వారి జీవితం నాశనం అయ్యే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం…అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి వయసు వచ్చిందని పెళ్లి జరిపించకూడదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వళ్ల అమ్మాయి సంతోషంగా ఉండకపోవడంతో పాటూ జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Advertisement
కేవలం అమ్మాయి నుండి వచ్చే కట్నానికి ఆశపడే వాళ్లకు ఇచ్చి వివాహం జరిపించకూడదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల తీసుకున్న కట్నం అయిపోయిన వెంటనే మళ్లీ అత్తింటి వేధింపులు తప్పవని కాబట్టి అబ్బాయి గురించి అతడి కుంటుంబం గురించి పూర్తిగా తెలుసుకుని వివాహం చేయాలంటున్నారు. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే….ఇరుగు పొరుగువాళ్లు చెబుతున్నారని తమ కూతురుకు వివాహం చేయకూదట. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కాబట్టి చుట్టుపక్కలవారు చెబుతున్నారని ముందూ వెనకా చూడకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆమె జీవితం నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు.
పెళ్లికి ముందు అబ్బాయి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలని చెబుతున్నారు. అది అంత ఈజీకాదు కాబట్టి పెళ్లి చూపులు జరిగిన వెంటనే పెళ్లి చేయకుండా కొంతకాలం చూసి ఆ తరవాత పెళ్లి జరిపించాలని చెబుతున్నారు. అమ్మాయికి అబద్దాలు చెప్పి పెళ్లి జరిపించకూడదట. ఆస్తుల విషయంలో….ఉద్యోగం విషయంలో అమ్మాయికి ఎక్కువ చెప్పి పెళ్లి జరిపిస్తే ఆ తరవాత ఊహించినంత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందట.
Also read : భార్యలు భర్తల దగ్గర ఈ విషయాలను అస్సలు దాచి పెట్టకూడదా..? అలా దాచి పెడితే వచ్చే నష్టాలు అవేనా..?