టాలీవుడ్ లో హీరోలుగా చేసిన నటులు ఎప్పుడూ హీరోలుగానే ఉంటారు. ఆరుపదుల వయస్సు వచ్చినా తగ్గేదే లే అంటూ హీరో వేశాలు వేస్తారు. ఇక ఇప్పుడు మైలేజీ తగ్గిపోతే హీరోలుగా విలన్ లుగా కూడా నటిస్తున్నారు. కానీ ఫాదర్ క్యారెక్టర్ లు మాత్రం చేయరు. కానీ హీరోయిన్లకు మాత్రం ఆ చాన్స్ ఉండదు. మూడు పదుల వయసు దాటితే చాలు రిటైర్ అయిపోవాల్సిందే. అదృష్టం భాగుంటే మరో ఐదు సంవత్సరాలు హీరోయిన్ లుగా నటిస్తుంటారు. కానీ ఆ తరవాత మాత్రం అక్క వదిన పాత్రలు చేయాల్సిందే. అంతే కాకుండా అవసరం వస్తే తల్లి పాత్రలు అయినా వేయాల్సిందే. ఇక కొంతమంది హీరోయిన్ లు తాము ఆడిపాడిన హీరోలకే తల్లిగా చేసే అవకాశాలు కూడా వస్తాయి.
Advertisement
Advertisement
అలా మెగాస్టార్ చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించిన ఇద్దరు హీరోయిన్ లు ఆయనకు తల్లిగా నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరు..వారు తల్లిగా చేసిన సినిమాలేవి అనేది ఇప్పుడు చూద్దాం…..1979లో జయసుధ, చిరంజీవి కాంబినేషన్ లో ఇది కథ కాదు అనే సినిమా వచ్చింది. ఈ చిత్రానికి బాల చందర్ దర్శకత్వం వహించారు. అంతే కాకుండా మగధీరుడు సినిమాలోనూ చిరంజీవి జయసుధ హీరోహీరోయిన్ లు గా నటించారు. కానీ 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిక్షావోడు సినిమా వచ్చింది. ఈ సినిమాలో జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. దాంతో అంతా అవాక్కయ్యారు.
ఇదిలా ఉంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సుజాత హీరోహీరోయిన్ లుగా నటించారు. ఆ తరవాత సీతాదేవి సినిమాలో సుజాత చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించింది. ఇక అక్కడితో ఆగకుండా 1995లో మెగాస్టార్ హీరోగా బిగ్ బాస్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన రోజా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు తల్లి పాత్రలో సుజాత నటించింది.