కోల్ కత్తాకు చెందిన రిహాన్ అనే 12 బాలుడు ఆలూ చిప్స్ తింటున్న సమయంలో పొరపాటున ప్లాస్టిక్ విజిల్ అతడి నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని పేరెంట్స్ కు చెబితే వాళ్లు కొడతారనే భయంతో ఆ బాలుడు విజిల్ మింగిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.
Advertisement
అతడు నోరు తెరిచి గట్టిగా గాలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా విజిల్ సౌండ్ అయ్యేది మొదట బాలుడి ఇబ్బందిని గ్రహించని తల్లిదండ్రులు…..బాలుడు చెరువుకు వెళ్లినప్పుడు కాసేపు కూడా నీటిలో ఉండకుండా బాగా రొప్పుతూ కనిపించడం, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడడాన్ని గమనించి…వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
Advertisement
ENT స్పెషలిస్ట్ డాక్టర్లు బాలుడికి X-రే, CT స్కాన్ లు చేసి అతని ఊపిరితిత్తుల్లో విజిల్ ఉండడాన్ని గమనించి, సర్జరీ ద్వారా ఆ విజిల్ ను తొలగించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ కాస్త 11 నెలల పాటు విజిల్ ఊపిరితిత్తుల్లో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అయినట్టు తెలిపారు డాక్టర్లు!