ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే పిల్లలు అందరూ ఒకే విధంగా ఉంటారు. అంటే ఓకే ఏజ్ వచ్చేవరకు వారు చిలిపి చేష్టలతో మారాం చేస్తూ ఉంటారు. ఏడాది పిల్లలు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల వరకు.. మనం చూసుకుంటే వాళ్లు ఫుడ్ చూస్తేనే ముఖం చాటేస్తూ ఉంటారు.. వారి నోట్లో ముద్ద పెట్టాలంటే పెద్ద యుద్ధం చేయాల్సిందే. మరి అలాంటి పిల్లలకు చేయించాలంటే ఈ చిట్కాలు కంపల్సరిగా తెలుసుకోవాల్సిందే..?
1. సాధారణంగా చిన్న పిల్లలకు ఆరు నెలల వయసు నుంచి మనం కొన్ని ఆహార పదార్థాలను ఇవ్వవచ్చు. వారికి పండ్లు మరియు కూరగాయలను అలవాటు చేయవచ్చు. ఈ విధంగా వారిని పెరిగే కొద్దీ వాటిపై ఇష్టం పెంచుకునే విధంగా ప్రోత్సాహం చూపించాలి.
Advertisement
Advertisement
2. చాలా మంది పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులను అనుసరిస్తారు. పెద్ద వాళ్ళు తినే వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి మనం తినేటప్పుడు వారికి తినిపించాలి. మనమేం తింటున్నాము అదే వారికి కూడా పెట్టాలి. కానీ ఆహారంలో పోషకాలు అనేవి తప్పనిసరి.
3. కుటుంబ సభ్యులంతా ఒకసారి కలిసి తినే అలవాట్లను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. దీని ద్వారా వారు పలు రకాల ఆహారపదార్థాలు వారు తినగలరు.
4. మనకు ఎక్కువగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు అలవాట్లను పిల్లలకు చేయాలి. భోజనం గురించి తరచూ మాట్లాడండి. వారికి కూడా అర్థమయ్యేలా చెప్పండి.
5. పిల్లలు ఎక్కువగా తినాలంటే మనం పండ్లను బొమ్మల ఆకృతిలో చేసి వారికి అందించాలి. వాటికి సంబంధించిన కథలను కూడా చెప్పి వాటిపై ఆసక్తి పెంచాలి.