ఓయో రూమ్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హోటల్స్ లో రూమ్స్ అత్యంత సౌకర్యవంతంగా దొరుకుతాయి. ఎవరైనా వేరే ప్లేస్ లో కి వెళ్ళినప్పుడు వారు అక్కడ బస చేయడానికి ఈ రూమ్స్ ఉపయోగిస్తారు. కానీ ప్రస్తుతం కొంతమంది ఈ రూమ్స్ ను కొన్ని అరాచక పనులకు వాడుకుంటూ చివరికి పోలీసులకు దొరికితే ఇబ్బందుల పాలవుతున్నారు. అది ఏంటో ఒక సారి చూద్దాం..? ఇద్దరు మేజర్లు అమ్మాయి,అబ్బాయి ఒక రూమ్ లో దొరికిపోతే నేరమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..?అంతకుముందు అమ్మాయి అబ్బాయి హోటల్ కి వస్తే కొన్ని డబ్బులు ఎక్కువ తీసుకొని రూం ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు.వచ్చిన వాళ్ల ఇద్దరిదీ ఆధార్ కార్డ్స్ తీసుకొని అందులో వాళ్ల భార్య భర్త అయితే వాళ్ళ ఇంటి పేర్లు ఒకే విధంగా ఉంటాయి.
అలాగే ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్ ని కంప్యూటర్ లో కొట్టి ఆ ఆధార్ కార్డు సరైందా కాదా అని చెక్ చేస్తారు. వాళ్లకు వీళ్లిద్దరు భార్యాభర్తలే అని నమ్మకం కలిగితేనే వాళ్ళకి రూమ్ ఇస్తారు. లేకపోతే ఓయో రూమ్ కి ఇచ్చిన వాళ్ళది తప్పు అవుతుంది. కొంతమంది ఓయో రూమ్ కి వస్తారు. మేమిద్దరం మేజర్లమే, ఒకే రూమ్ లో ఉండడానికి అర్హులం అంటూ వచ్చి ఓయో హోటల్లో రూమ్ తీసుకుంటారు. ఇంతలో ఎవరైనా పోలీసులు వస్తారు.
Advertisement
Advertisement
అమ్మాయి దగ్గర పరుసు ఉంటుంది. అందులో కొంత డబ్బులు వారికి దొరుకుతాయి. దీంతో వారు డబ్బులకు మీ శరీరాన్ని అనుకుంటూన్నావ్ అంటూ కేసు బుక్ చేస్తారు. ఆ సమయంలో మనం పోలీసులకు ఏం చెప్పినా నమ్మరు. అక్కడ దొరికిన ఇద్దరిని అరెస్టు చేస్తారు. కేస్ ఫైల్ చేసి అమ్మాయిని మహిళా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారు. కానీ అందులో దొరికిన అబ్బాయిని జైలుకు పంపిస్తారు. అతను ఏం చెప్పినా వారు వినరు. అయితే కొన్ని చిన్న చిన్న లాడ్జిలో మాత్రం కొంతమంది తరచూ జంటలకు ఆశ్రయం ఇస్తుంటారు. ఈ చిన్న చిన్న లాడ్జి లను పోలీసులు ఎక్కువగా తనిఖీ చేయరు. అలాగే ఇలాంటి హోటళ్లలో అప్పుడప్పుడు పోలీసులు రైడింగ్ చేస్తే మైనర్ వ్యక్తులు కూడా దొరుకుతూ ఉంటారు. ఈ సందర్భంలో హోటల్ ఇచ్చిన మేనేజర్ పై పోలీసులు కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.