జంతువుల్లో అన్నింటి కంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దైన్నైనా పిసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తుంటారు.
Advertisement
అంతే కాకుండా మిగితా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేవి కూడా శునకాలే. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాలలో కంటే పట్టణాల్లో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటారు. పట్టణాల్లో ఇతరులతో తక్కువ సంబంధాలు ఉంటాయి. కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరదాగా గడపవచ్చని అనికుంటున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే కుక్కలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి అవి మూత్రం పోసేటప్పుడు గమనిస్తే వాహనాల టైర్ల మీద…వాహనాల మీదనే ఎక్కువగా పోస్తుంటాయి. కానీ కుక్కలను పెంచుకునే చాలా మందికి అవి అలా ఎందుకు పోస్తున్నాయో అర్థం కాదు. కొందరయితే అలా చేస్తే తమ వాహనం పాడవుతుందని పెంచుకునే కుక్కను కొడతారు కూడా.
అయితే దానికి వెనకాల ఒక పెద్ద కారణం ఉంది. సాధారణంగా కుక్కలకు చెత్తకుప్పలపై విసర్జించే గుణం ఉంటుంది. శుభ్రంగా ఉండే ప్రదేశాల్లో అవి విర్జించవు. వాహనాలు రోడ్లపై తిరిగే క్రమంలో చెత్త చెదారం అన్నింటిని తొక్కుతాయి. కాబట్టి టైర్లు కూడా చెడు వాసన వస్తాయి. కాబట్టి వాహనాల టైర్లను కూడా కుక్కలు చెత్త అని భావించి అక్కడ విసర్జిస్తుంటాయి.
ALSO READ :
మీ వాట్సాప్ చాట్ వేరే వాళ్లు చూస్తున్నారా..? మీరు ఎలా తెలుసుకోవచ్చంటే..?