వ్యాపారం చేయడం చాలా కష్టం…దాన్ని లాభాల బాట పట్టించడం మరింత కష్టమైన పని. కానీ కేరళలోని కాసరగోడ్ జిల్లాకు చెందిన 47ఏళ్ల కలప వ్యాపారి షానవాస్ కస్టపడి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతే కష్టపడి వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. అతడికి 35ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో పక్షవాతం బారినపడ్డాడు. దాంతో అతడి జీవితం అంతా అనుకోని మలుపు తిరిగింది. అతడు మాట్లాడటం తప్ప బెడ్ మీద నుండి కదల లేదు. ఎక్కడకూ వెళ్ళలేదు. యాక్సిడెంట్ లో అతడి వెన్నుపూసకు గాయం అవ్వడం తో మెడ వరకు స్టీల్ రాడ్డును అమర్చారు.
Advertisement
దాంతో అతడు మొదట తీవ్ర నిరాశ చెందాడు. అతడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతుండగా జరిగిన ప్రమాదం వల్ల ఎంతో వేదన అనుభవించాడు. కానీ వ్యాపారాన్ని వదిలిపెట్టవద్దని నిర్ణయించుకున్నాడు. దాంతో చెవికి బ్లూటూత్ పెట్టుకుని తన టింబర్ డిపోలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. జన్మభూమి అనే వెబ్ సైట్ లో తనకు వచ్చే కలప ఆర్డర్ లను తీసుకుని పనివాళ్ళతో వర్క్ చేయించడం మొదలు పెట్టాడు. దాంతో మళ్ళీ వ్యాపారం గాడిలో పడింది. అలా పదకొండేళ్ల నుండి బెడ్ పై నుండే వ్యాపారం చూసుకుంటున్నాడు. తీవ్రగాయాలతో ఆయన జీవితాంతం బెడ్ పైనే గడపాలి కానీ నిరాశను పక్కన పెట్టి వ్యాపారాన్ని లాభాల బాటలో పెట్టాడు.
Advertisement
ప్రస్తుతం తన వ్యాపారం లో కోట్లు సంపాదిస్తున్నాడు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక షానవాస్ కు తన భార్య మరియు ఇద్దరు కూతుళ్లు కాస్త సహాయం చేస్తారు. తినిపించడం…నీళ్ళు తాగించడం వాళ్లే చేస్తుంటారు. అతడి భార్య ఎప్పుడూ పక్కనే అంటూ అతడి భాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే చాలామంది యువత ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాంటి వాళ్ళు షానవాస్ ను చూసి ఎంతో నేర్చుకోవాలి.