ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల వాడకం అనేది దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. పొల్యూషన్ తగ్గించడం కోసం ప్రభుత్వాలు కూడా వీటి తయారీకి అనుమతులు ఇస్తున్నాయి. దీంతో ఎలక్ట్రికల్ వాహనాల చాలా కంపెనీలు వివిధ రకాల మోడల్స్ లో వాహనాలను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రికల్ వాహన దిగ్గజం ఓలా వాహన కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది.
Advertisement
ఓలా S1 ప్రో బైకును బుక్ చేసుకున్నటువంటి కస్టమర్లకు 24 గంటల్లో వెహికల్ డెలివరీ అందిస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే ఇప్పటికే కొంతమంది కొనుగోలుదారులకు అందించే నట్టుగా సంస్థ తెలియజేసింది. ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ S1 PRO వాహనాల డెలివరీ పై ట్వీట్ చేశాడు. సాధారణంగా వాహనాన్ని బుక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆటోమొబైల్ కంపెనీలు ఆ వెహికల్ లో కస్టమర్కు అందించడానికి సమయం పడుతోంది. కానీ ఓలా కంపెనీ అలా కాదు బుక్ చేసుకున్న 24 గంటల్లో వాహనాన్ని అందిస్తామంటూ ట్వీట్ చేశారు.గత సంవత్సరం ఓలా ఎలక్ట్రికల్ వాహనాన్ని విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే దాని పరిచయం విండోలను కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక చివరి సారిగా మే 21వ తేదీన పర్చేస్ విండోను విడుదల చేసినది. ఈ విండో ను అందుబాటులోకి తెచ్చే ముందు దేశంలోని పలు నగరాల్లో టెస్ట్ రైడ్ నిర్వహిస్తుంది.
Advertisement