Ad
పెళ్లి కొడుకు ఊరేగింపులో ఏర్పాటు చేసిన DJ చప్పుళ్ల కారణంగా తన 63 కోళ్లు చనిపోయాయని ఒడిశాకు చెందిన రంజిత్ నీలగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేశాడు. రంజిత్ ఇంటి సమీపంలోనే ఉండే రామచంద్ర పెళ్లిలో రాత్రి 11 గంటలకు పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకొస్తూ పెద్ద ఎత్తున సౌండ్ వచ్చే DJ లను వాడారు.
Advertisement
Advertisement
ఆ శబ్దాలకు కోళ్లు బెదిరి వణికిపోవడాన్ని గమనించిన రజింత్…ఇదే విషయాన్ని పెళ్లి ఇంటి వారికి తెలియజేశాడు. అయినా వారంతా DJ ఊపులో, తాగిన మత్తులో తననే బెదిరించారని అన్నాడు. 2000 కోళ్లున్న తన ఫౌల్ట్రీ ఫారమ్ లో 63 కోళ్లు చనిపోయాయని పోలీస్ లకు ఇచ్చిన కంప్లైట్ లో తెలిపాడు. పెద్ద శబ్దం కారణంగానే కోళ్లు షాక్కు గురయ్యి చనిపోయాని స్థానిక పశువైద్యుడు నిర్ధారించాడు.