Home » వంట గదిలో మనకి తెలియకుండానే చేసే ఈ 9 తప్పుల గురించి తెలుసా ? అవెంతటి ప్రమాదం అంటే ?

వంట గదిలో మనకి తెలియకుండానే చేసే ఈ 9 తప్పుల గురించి తెలుసా ? అవెంతటి ప్రమాదం అంటే ?

by Azhar
Ad

ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో వారికీ తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు. అవి వారికే ప్రమాదంగా మారుతాయి. అలాగే వంట గదిలో మనకి తెలియకుండానే చేసే ఈ 9 తప్పులు కూడా మనకు చాలా ప్రమాదం. అవేమిటంటే.. మనం చికెన్ తీసుకొని వచ్చినప్పుడు.. దానిని అక్కడే ఉన్న సింక్ లో కడుగుతాం. అలా చేయకూడదు. ఎందుకంటే.. అలా చేస్తే ట్యాప్ లో నుండి ఫోర్స్ గ వచ్చే నీళ్లు చికెన్ పైన పడి.. పక్కనే ఉన్న బోళ్ళు, ఇతర వాటిపైన పడుతాయి. అప్పుడు చికెన్ పైన ఉండే బ్యాక్టీరియా వాటి పైకి చేరుతుంది. అది మనకు హానికరం. అలాగే అప్పుడే తెచ్చిన మాంసాహారాన్ని నేరుగా ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదు. అలా చేస్తే కూడా చికెన్ బ్యాక్టీయారా వేరే పదార్ధాల పైకి వస్తుంది. అందుకే చికెన్ ను ఓ గిన్నెలో పెట్టుకొని.. దాని పైన మూత పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

Advertisement

Advertisement

ఇక పచ్చి కూరగాయలను మాములుగా నీటిలో కడగడం వల్ల దానిపైన ఉండే బ్యాక్టీయారా పోదు. అందుకే వాటిని సోడియం హైపోక్లోరైట్ వేసిన నీళ్లలో ఓ పావుగంట ఉంచాలి. ఇక మనం కూరగాయలను బాగా కడిగి వండుకొని చేతులు కడుకోకుండా తిన్నడం మంచి అలవాటు కాదు. ఎందుకంటే అలా చేస్తే చేతుల పైన ఉన్న బ్యాక్టీయారా మన లోపలి వెళ్తుంది.ఇక మనం పచ్చి మాంసాన్ని కోసిన చొట్ట శుభ్రం చేయకుండా వేరే కూరగాయలు, పండ్లు కోయకూడదు. అలాగే కోసిన ఆ కత్తిని కూడా శుభ్రం చేయాలి. ఇక ఆహారాన్ని వేడిగా ఉండగానే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బయట ఉండగానే ఆహరం చల్లబడితే దానిలో బ్యాక్టీయారా చేరి.. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అది ఇంకా ఎక్కువై అందులో ఉన్న మిగితా పద్దార్దల పైన కూడా పెరుగుతుంది.

ఇక ఫ్రిడ్జ్ లో ఏ పదార్ధాలు.. ఎక్కడ పెట్టాలో కూడా చాలా మందికి తెలియదు. ఫ్రిడ్జ్ లోని పైన ట్రేలో గుడ్లు, పాలు.. దానికింద మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, వాటి కింద ఎక్కువ కూల్ అవసరం లేనివి.. ఇక కింద ట్రేలో కూరగాయలు, పండ్లు అలాగే పక్కన డోర్ లో నీళ్లు, డ్రింక్స్, మసాలా వంటిని ఉంచుకోవాలి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచిన వాటిని బయటకు తీసి కరిగించకూడదు. అలా చేసేటప్పుడు దాని పైన ఉన్న బ్యాక్టీయారా బయట వ్యాప్తి చెందుతుంది. ఇక అదే విధంగా ఫ్రిడ్జ్ ను శుభ్రంగా ఉంచుకోకపోవడం కూడా మంచిది కాదు.

ఇవి కూడా చదవండి :

SRH అందుకే ఈ సీజన్ లో ఓడిపోయింది.. వారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే..?

సాహాకు బ్యాడ్ టైం.. అన్ని గొడవలే..!

Visitors Are Also Reading