Home » ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఈ సినిమానే…!

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఈ సినిమానే…!

by Azhar
Ad

నందమూరి నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారి గురించి తెలుగు ప్రజలకు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సినిమా ప్రపంచాన్ని ఎంతోకాలం ఏలిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనకు సినిమాల్లో లభించిన మద్దతే ఇక్కడ కూడా ప్రజల నుండి లభించింది. సీఎంగా ఆంధ్రప్రదేశ్ కు ఆయన ఎన్నో సేవలను చేసారు. అయితే ఎన్టీఆర్ గారు రాకీయాల్లోకి రావడానికి ఆయనను ఒక్క సినిమా చాల ప్రభావితం చేసిందట.. అదేదో ఇప్పుడు చూద్దాం.

Advertisement

హీరోగా ఎన్టీఆర్ గారి జీవితంలో ఎన్నో సూపర్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో సర్ధార్ పాపారాయుడు సినిమా కూడా ఒక్కటి. 1980 లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు వేషంలో కనిపించారు. ఆ పాత్రా చేస్తున్నప్పుడే ఆయనకు రాజకీయాల్లోకి రావాలని.. ప్రజలను సేవ చేయాలనీ అనిపించింది. నా దేశం, బొబ్బిలి పులి సినిమాలు కూడా ఆయనలో ప్రజా సేవ చేయాలి అనే ఆలోచనా తెచ్చిన.. ఆయనను పూర్తిగా రాజకీయనాయకునిగా మార్చింది మాత్రం సర్ధార్ పాపారాయుడు సినిమానే.

Advertisement

 

ఈ సినిమా తర్వాత రెండేళ్లకే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి సీఎం అయ్యారు. అయితే అప్పట్లో ఆయన చేసిన సర్ధార్ పాపారాయుడు, నా దేశం, బొబ్బిలి పులి సినిమాలు కూడా ప్రజలు ఆయనకు ఓటు వేయడానికి ఓ కారణం అని అంటుంటారు. కేవలం ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించిన ఆయన ఏకంగా పీఎం పీఠాన్ని కూడా కదిలించిన విషయం అందరికి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading