భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 2,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 మరణాలు నమోదు అయ్యాయి.
తీవ్ర వాయుగుండం నుండి అవని తుఫాన్ వాయుగుండంగా బలహీనపడినట్టు ఏపీ విపత్తుల శాఖ డైరెక్టర్ తెలిపారు. కొన్నిగంటల తర్వాత మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని …. కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు
Advertisement
నారాయణపేట జిల్లా మాగనూరు ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై కర్ణాటక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. హుబ్లీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగినట్టు సమాచారం.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు కనిపిస్తున్నాయి. 900 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సె క్స్ ఉండగా 270 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కనిపిస్తోంది.
తిరుమలలో ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యటించనున్నారు. ఈనెల 14న తిరుమల చేరుకుని ఈనెల 16న స్వరూపానందేంద్ర శ్రీవారిని దర్శించుకున్నారు.
Advertisement
తెలంగాణలో ఈనెల 23 నుండి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుండి ఆన్లైన్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
కేరళలో టమాటా ఫ్లూ వైరస్ వణికిస్తోంది. కేరళలోని కొల్లాం లో ఈ వైరస్ వెలుగుచూసింది. 80 మంది చిన్నారులు వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జ్వరం, నీరసం, కడుపు నొప్పి లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు.
ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదయింది. రాజధాని లో తొలి కరోనా కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు.
తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమ కుటుంబానికి చెందినదే అంటూ బిజెపి ఎంపీ జైపూర్ మాజీ యువరాణి దియా కుమార్ మీర్జా సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజ్ మహల్ స్థలం తమదేనంటూ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని తెలిపింది. స్థలాన్ని షాజహాన్ స్వాధీనం చేసుకున్నారని పరిహారం ఇచ్చినప్పటికీ అదేమంత అంటూ ప్రశ్నించింది.
శంషాబాద్ మండల మాజీ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో సురేందర్ రెడ్డి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.