సినీపరిశ్రమలో ఎంతో పాపులారిటీ సంపాధించుకున్న కొంతమంది హీరోలు అర్ధాంతరంగా కన్నుమూశారు. అలా చనిపోయిన తరవాత అభిమానుల ఆవేదన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇక అలా చనిపోయిన హీరోలు అప్పటికే నటించిన సినిమాలు మరణానంతరం విడులయ్యాయి. అలా హీరోలు చనిపోయిన తరవాత విడుదలైన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….రీసెంట్ గా గుండె పోటుతో మరణించిన పునీత్ రాజ్ కుమార్ అప్పటికే జీన్స్ సినిమా షూటింగ్ 90శాతం పూర్తిచేసుకున్నాడు. ఇక పునీత్ మరణించడంతో ఆ సినిమాను డబ్బింగ్ లేకుండానే ఈ యేడాది విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
Advertisement
బాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని అందర్నీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే సుషాంత్ చనిపోయేనాటి దిల్ బేచారా చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక ఈ సినిమాను సుషాంత్ చనిపోయిన 40రోజులకే విడుదల చేయగా సూపర్ హిట్ గా నిలిచింది. సుషాంత్ అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
Advertisement
సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ భారిన పడ్డారు. ఆ తరవాత ఆయన చివరిగా మనం అనే సినిమాలో నటించారు. నాగేశ్వరరావు చనిపోయిన తరవాత ఈ సినిమా విడుదల కాగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి ఇది ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.
సహజనటి సౌందర్య ఎవరూ ఊహించని విధంగా హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే అప్పటికే సౌందర్య ఆప్తమిత్రుడు శిశశంకర్ అనే సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు సౌందర్య చనిపోయిన తరవాత విడుదలయ్యాయి.
ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న దివ్య భారతి కూడా అర్థాంతరంగా తనువు చాలించింది. అయితే చనిపోయేనాటికే దివ్య భారతి కూడా తొలిముద్దు అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.దాంతో దివ్య భారతి మరణించిన తరవాత ఈ సినిమాను విడుదల చేశారు.
ప్రముఖ హీరోయిన్ ప్రత్యూష కూడా అర్థాంతరంగా మరణించింది. ఇక ప్రత్యూష కూడా చనిపోయేనాటికే సౌండ్ పార్టీ. ఈ సినిమాను ప్రత్యూష చనిపోయిన రెండు సంవత్సరాల తరవాత విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది.