Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టారు. పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల అయింది.
Advertisement
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ అప్పుడప్పుడు రాజకీయాల కోసం బ్రేక్ తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ కూడా ఉండటంతో పవన్ డేట్స్ సర్దుబాటు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు అనే సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్లు వేశారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎ ఎం రత్నం నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కు కూడా సడన్ బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
ఏపీలో ఎన్నికలు దగ్గర పడటం వల్లే పవన్ అటువైపు దృష్టి సాధిస్తున్నారని దాంతో షూటింగ్ సడన్ గా క్యాన్సల్ అవుతూ వస్తుందని సమాచారం. అయితే స్టార్ హీరోల సినిమా అంటే వందల మంది జూనియర్ ఆర్టిస్టులు పనిచేస్తారు. అదేవిధంగా భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి భారీ సెట్స్ ను ఏర్పాటు చేయాల్సి వస్తుంది.
అదేవిధంగా టెక్నికల్ టీం ఇతర సిబ్బంది అందరూ రావాల్సి వస్తుంది. ఇక సడన్ గా షూటింగ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఒక్కరోజుకే నిర్మాతకు భారీ మూల్యం తప్పడం లేదని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక రోజుకు పది నుండి పదిహేను లక్షల వరకు ఖర్చు వృథా అయ్యే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తోంది.
Also Read:
“రంగస్థలం” కథను చిరంజీవి నటించిన ఆ సినిమా నుండి కాపీ కొట్టారా…?