జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు అన్న విషయం మనం చాలా సార్లు వినే ఉంటాం. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెత మనం వినే ఉంటాం. అంతేకాక మనిషిని చూసి మనిషి వేషధారణను చూసి మనిషిని కూడా అంచనా వేయకూడదు. మనిషి వేషధారణ బాగాలేదు అంటే అతని వ్యక్తిగత జీవితం సమస్యలా చూడాలి,వీలైతే ఆ పరిస్థితి నుండి అతను కాని ఆమె కాని బయటపడేందుకు మన శక్తి మేర సహాయం చేయాలి కానీ వారిని నిరాశపర్చకూడదు. అయితే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు అనట్టు మనం ఒక్కోసారి రోడ్డు మీద బ్రతికే వారు కూడా మనల్ని వారికున్న టాలెంట్ తో ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటీవల అచ్చం ఇలాగే జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే సామెత ఈమెకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది.
Advertisement
Advertisement
వారణాసిలో గత మూడు సంవత్సరాలుగా వీధుల్లో నివసిస్తున్న సౌత్ ఇండియాకు చెందిన ఓ మహిళ ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతోంది. అయితే ఈ మహిళను ఓ వ్యక్తి ఇంటర్వ్యూ చేయడంతో కళ్ళు చెదిరే నిజాలు బయటికొచ్చాయి. సదరు మహిళ చెప్పిన వివరాల ప్రకారం ఆ మహిళ తాను తాను స్వాతిగా పరిచయం చేసుకొని బనారస్ హిందూ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నానని చెప్పడంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అయితే పెళ్లి అయి ఒక బాబు పుట్టిన తరువాత కుడివైపు భాగం పక్షవాతానికి గురవడంతో ఇక కుడి వైపు శరీర భాగం మొత్తానికి పనిచేయడం లేదు. దీంతో ఇంట్లో నుండి వచ్చానని నాకు చారిటీ వద్దని ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలని వేడుకుంటున్నది. అయితే అందరూ ఈమెకు మతిస్తిమ్మితం బాగా లేదని అనుకుంటున్నారు కానీ ఈ మహిళా చాలా ఆరోగ్యంగా చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడుతోంది. ఈ మహిళ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
Watch Video :