Home » May 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఇండియా మరియు తెలుగు రాష్టాల్లో ముఖ్యమైన వార్తలు టాప్ టెన్ లో ప్రతి రోజు మీకోసం మనంన్యూస్ అందిస్తుంది.

Ap cm jagan

Ap cm jagan

సీఎం జగన్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. విద్యాదీవెన కార్యక్రమంలో జగన్‌ పాల్గొననున్నారు. టీటీడీ పిల్లల ఆసుపత్రి భవనానికి సీఎం భూమి పూజ చేయనున్నారు.

Advertisement

 

బంజారాహిల్స్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. 16 మందిని పట్టుకున్నారు. రూ.15 లక్షలు స్వాధీనం చేసుకోగా పట్టుబడినవారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.

 

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై దాడి జరిగింది. రాడ్డుతో అబ్బాయిపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసి చంపేశారు.

 

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన భారీ సభ కు వస్తున్నారు. ఈ సభకు లక్ష మందిని సమీకరించే పనిలో బిజెపి నేతలు ఉన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు తరన్ చుగ్ కూడా పాల్గొన బోతున్నారు.

 

పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ అందించాలని సూచించారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని చెప్పారు.

Advertisement

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47వేలకు చేరింది. నిన్న 47,200 ఉండగా ఈరోజు 200 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,280 గా ఉంది.

 

శుక్రవారం హనుమకొండలో నిర్వహించబోయే రైతు సంఘర్షణ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరవుతున్న నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో 3 వేదికలు సిద్ధం చేశారు. 5 లక్షల మందితో ఈ సభను విజయవంతం చేయాలని నాయకులు భావిస్తున్నారు.

 

ఏపీలో ఆర్టీసీ సంస్థ 998 అద్దె బస్సులను తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించాయి. దానిపై ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమల రావు క్లారిటీ ఇచ్చారు. కొత్త బస్సులను కొనుగోలు చేసే పరిస్థితి తగ్గించుకునేందుకే అద్దె బస్సులు తీసుకుంటున్నట్టు చెప్పారు.

 

ఉక్రెయిన్ కు అమెరికా సహా ఇతర దేశాలు సాయం చేస్తున్న నేపథ్యంలో రష్యా కన్నెర్ర చేసింది. అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు పాల్పడుతోంది. ఐదు రైల్వే స్టేషన్లలో విద్యుత్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. చమురు ఆయుధ డిపోలను సైతం నేలమట్టం చేసింది.

 

ఏపీ తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతే కాకుండా పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

Visitors Are Also Reading