టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన వివాదం గురించి తెలిసిందే. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ ఓ ప్రాంక్ వీడియోలో కనిపించారు. అయితే ఈ ప్రాంక్ ను రోడ్డు మీద చేయడం…అందులో ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని చనిపోతున్న అంటూ బెదిరించడంతో వార్తల్లో నిలిచింది.
దానిపై టీవీ9 స్పెషల్ కవరేజ్ ఇచ్చింది. అయితే ఇందులో భాగంగా యాంకర్ దేవి నాగవల్లి డిప్రెషన్ పర్సన్ అని పాగల్ సేన్ అంటూ వ్యాఖ్యానించింది. ఆ మాటలు విన్న విశ్వక్ సేన్ నేరుగా స్టూడియో కి వెళ్లారు. అక్కడ యాంకర్ దేవి నాగవల్లి పై ఫైర్ అయ్యారు. ఎఫ్ పదంతో యాంకర్ ను దూషించారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు కొంతమంది దేవి నాగవల్లి కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విశ్వక్ కు మద్దతు ఇస్తున్నారు.
Advertisement
Advertisement
తాజాగా టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా విశ్వక్ కు తన మద్దతు ప్రకటించాడు. టీవీ9 దౌర్భాగ్యమైన ఛానల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో వినోదాన్ని పంచుతుంది అంటూ ఓ రేంజ్ లో మండిపడ్డారు. కాగా రాహుల్ రామకృష్ణ పై కూడా కొంత మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.