సినిమా హీరోలు పాటలు పాడటం…దర్శకులు కొన్ని సీన్లలో తలుక్కుమనడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కానీ హీరోలు..దర్శకులు పాటలు రాయడం మాత్రం చాలా అంటే చాలా అరుదు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు పాటలు కూడా రాశారు. ఆ పాటలకు మంచి పేరు కూడా రావడం విశేషం. ఇంతకీ అలా పాటలు రాసిన దర్శకులు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…రీసెంట్ గా పవన్ కల్యాణ్ రానా హీరోలుగా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ థీమ్ సాంగ్ కు లిరిక్స్ అందించారు. భీమ్ భీమ్ భీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా త్రివిక్రమ్ రవితేజ హీరోగా నటించిన ఒకరాజు ఒకరాణి సినిమాకు కథను అందించడే కాకుండా సినిమాలోని పాటలన్నింటికీ తానే లిరిక్స్ ను అందించాడు.
ఇక తమిళ హీరో ధనుష్ లో కూడా మంచి పాటల రచయిత ఉన్నాడని అతికొద్దిమందికే తెలుసు. ధనుష్ సూపర్ హిట్ సాంగ్స్ వై దిస్ కొలవరి మరియు రౌడీ బేబీ లాంటి పాటలకు లిరిక్స్ అందించి వారెవా అనిపించుకున్నాడు.
Advertisement
Advertisement
మెహర్ రమేష్ దర్శకుడిగానే మనందరికీ పరిచయం. అయితే ఆయనలోనూ మంచి పాటల రచయిత ఉన్నాడన్నది మాత్రం అతికొద్ది మందికే తెలుసు. మెహర్ రమేష్ కంత్రి, బిల్లా లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా కంత్రి సినిమాలో వన్ టూ త్రీ నేనొక కంత్రీ అనే పాటను రాశి శబాష్ అనిపించుకున్నారు. ఇక ఈ పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడటం మరో హైలెట్ అనే చెప్పాలి.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాత్ లోనూ ఓ పాటల రచయిత ఉన్నారు. ఈ విషయం రీసెంట్ గానే బయటకు వచ్చింది. పూరీ తన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో మేరా నామ్ వాస్ కోడిగామ అనే పాటకు లిరిక్స్ అందించారు. ఇక ఈ పాట ప్రస్తుతం మారుమోగిపోతోంది.
తమిళ దర్శకుడు హీరోయిన్ నయనతారకు కాబోయే వాడు విగ్నేష్ శివన్ దర్శకుడే కాకుండా మంచి పాటల రచయిత కూడా….ఆయన ఏకంగా యాబైకి పైగా పాటలను రాసి శ్రోతలను అలరించారు. రీసెంట్ గా విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోనూ విగ్నేష్ శివన్ ఓ పాటను రాశారు.